తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలు దాటినా... మంచు తగ్గడం లేదు. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. హైదరాబాద్లో చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. దీంతో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శ్రీకారం చుట్టారు. రాజమండ్రి విమానాశ్రయ టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు.
Vizag: భారతదేశం - పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4 న నేవీ డే జరుపుకుంటారు. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది.
నేడు సంగారెడ్డి జిల్లాలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన. జోగిపేటలో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించనున్న మంత్రి దామోదర రాజనర్సింహ
గ్రామీణ ప్రాంతాల్లో యువతలో దాగిఉన్న క్రీడలను వెలికితీసింది ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్.. అందులో భాగంగా క్రీడాకారుల కోసం టాలెంట్ సెర్చ్ పెడుతోంది.. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.. యువతలో క్రీడలను ప్రోత్సహించే విధంగా ఒప్పందాలు చేసుకుంటుంది.. 9 సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది ఏపీ ప్రభుత్వం.