ప్రముఖ నిర్మాత బన్నీవాస్కు కీలక బాధ్యతలు అప్పగించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ ప్రచార విభాగం ఛైర్మన్గా బన్నీవాస్ను నియమించారు.. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని బన్నీవాస్కు అందజేశారు జనసేనాని..
తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు తగ్గడానికి తోడు శీతల గాలులు బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో ఇంటిలో ఉన్నప్పటికీ జనంలో వణుకు తగ్గడం లేదు. దీంతో చలిమంటలను జనం ఆశ్రయిస్తున్నారు. స్వెట్టర్లు, రగ్గులు కప్పుకున్నా.. చలి మాత్రం వాయించేస్తోంది. దీంతో ఇదెక్కడి చలిరా బాబు అంటూ జనం గజగజా వణుకుతున్నారు.
ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 1లో మంత్రివర్గం సమావేశమవుతోంది. మిచౌంగ్ తుఫాన్, పంట నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలపై చర్చిస్తారు. జనవరి 1 నుంచి 3 వేల రూపాయలకు పెన్షన్ పెంపు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలకు నిధుల విడుదల సహా పలు కీలక అంశాల పై చర్చ జరిగే అవకాశం ఉంది.