Daggubati Purandeswari: రైతులకు కేంద్రం అండగా నిలుస్తోంది.. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయేలా చేస్తోందని దుయ్యబట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. గన్నవరంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.. సమావేశంలో కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాజ్ కుమార్ చాహర్, బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కునైక్ స్వామి తదితరులు పాల్గొన్నారు.. వివిధ పంటలు సాగు చేసే రైతులతో ముఖా ముఖీ నిర్వహించారు.. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. పాదయాత్రలో రైతు సంక్షేమంపై ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్ మరిచారన్నారు.. రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలం చెందిందన్న ఆమె.. ఏపీలోని రైతు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అని ప్రకటించారు.
Read Also: K. Laxman: సీబీఐ విచారణ ఎందుకు అడగడం లేదు.. రేవంత్ కు లక్ష్మణ్ ప్రశ్న
ఇక, ఏపీలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉంది అన్నారు కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్ కుమార్ చాహర్.. కేంద్రం అమలు చేస్తున్న పంటల బీమా పథకాన్ని ఏపీలో సక్రమంగా అమలు చేయడం లేదన్న ఆయన.. రైతులు చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తామని హామీ ఇచ్చి దగా చేసిందన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహరం చెల్లింపుల్లోనూ అలక్ష్యమే ఉంది.. రైతులకు కేంద్రం అండగా నిలుస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయేలా చేస్తోందని దుయ్యబట్టారు రాజ్ కుమార్ చాహర్.