Liqour Sales New Record: న్యూ ఇయర్ జోష్.. ఏపీలో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liqour Sales New Record: ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి.. భారత్‌లోనూ న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలారు యువత.. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ జోష్ కనిపించింది. ముఖ్యంగా డిసెంబర్ 31, జనవర్ 1వ తేదీన.. రెండు రోజుల పాటు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి.. తెలంగాణతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ లిక్కర్ సేల్క్ కొత్త రికార్డు సృష్టించాయి.. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు.. ఈ రెండు రోజుల్లో కలిపి ఏకంగా దాదాపు రూ.250 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించినట్టు తెలుస్తోంది.. డిసెంబర్ 31వ రోజున రాష్ట్రవ్యాప్తంగా రూ.147 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు తెలుస్తుండగా.. జనవరి 1వ తేదీకి వచ్చేసరికి దాదాపు రూ.100 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also: Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో వేళలు పొడిగింపు..!
Also Read
- DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
- Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
- Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్‌కు NIA సమన్లు
- AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
రాష్ట్రంలో డిసెంబర్ 31వ తేదీన 1.51 లక్షల కేసుల లిక్కర్, 67 వేల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్టు అధికారులు అంచనా వేస్తు్న్నారు.. గతేడాది అదే రోజున రూ.142 కోట్ల విలువైన మద్యం అమ్మగా, ఈసారి రూ.5 కోట్ల మేర అమ్మకాలు పెరిగిపోయాయి.. ఇక, 2024 జనవరి 1వ తేదీతో పోలీస్తే.. 2023 జనవరి 1న మద్యం అమ్మకాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు.. 2023 జనవరి 1న రూ.98 కోట్ల మద్యం అమ్మకాలు సాగగా.. ఈ ఏడాది అది రూ.100 కోట్ల పై మాటే.. 31, జనవరి 1 తేదీల్లో మద్యం షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు.. మద్యం అమ్మేందుకు ప్రభుత్వం అనుమతించడానికి సెలబ్రేషన్స్ తోడుకావడంతో.. సేల్స్ అమాంతం పెరిగాయి.. ప్రతిరోజు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.75 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతుండగా.. ఈ రెండు రోజుల్లో అది అమాంతం పెరిగిపోయింది.
తాజావార్తలు
-
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్‌కు NIA సమన్లు
-
AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!