Kakinada: కాకినాడ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.. ఇదే సమయంలో.. ఇతర పార్టీల నేతలను కూడా కలుస్తున్నారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇప్పుడు జనసేన పార్టీకి టచ్‌లోకి వెళ్లారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు.. అయితే, పవన్ కల్యాణ్ పిలిచారు.. అందుకే వెళ్లి కలిసినట్టు చెప్పుకొచ్చారు.. ఈ భేటీలో జిల్లా రాజకీయాల గురించి పవన్ అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఇక, జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పనిచేసే పరిస్థితి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ సమావేశంలో జనసేనాని ముందు కీలక ప్రతిపాదన పెట్టాడట ఎమ్మెల్యే చంటిబాబు.. కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పవన్ ను కోరారట జగ్గంపేట ఎమ్మెల్యే..
Read Also: CM Revanth Reddy: ప్రజాపాలన అప్లికేషన్ల అమ్మకాలు.. సీఎం సీరియస్..!
టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ సీటును జనసేనకి కేటాయించడం ఖాయమన్న చంటిబాబు.. ఆర్థికంగా తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, పార్టీ తనకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రతిపాదన పెట్టారట.. ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు జనసేనలో కాకినాడ ఎంపీగా పోటీ చేసేవారు ప్రస్తుతానికి ఎవరూ లేరని.. ఎవరు పోటీ చేసిన బయట నుంచి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేయడం తప్పదని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారట.. దీంతో ఆలోచనలో పడిపోయిన జనసేనాని.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పారట.. వనరుల విషయంలో ఎటువంటి డోకా లేదని తన వియ్యంకుడు తనకంటే 100 రెట్లు ఆస్తి ఉన్నవాడని పవన్ కల్యాణ్‌తో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా.. మొదట టీడీపీతో టచ్‌లోకి వెళ్లిన జ్యోతుల చంటిబాబు.. ఆ తర్వాత జనసేన వైపు మళ్లారు.. పవన్‌తో కలిసి చర్చలు జరపడం ఇప్పుడు కాకినాడ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.