YSR Pension Kanuka: గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు ప్రతీ ఏడాది పెన్షన్ పెంచుతూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పెన్షన్లను క్రమంగా రూ. 3000 వరకూ పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు బాసటగా ఉంటూ పెన్షన్ వచ్చారు.. ఇప్పటి వరకు పెన్షన్ రూ.2,750గా వస్తుండగా.. ఇవాళ్టి నుంచి అది రూ.3 వేలకు పెరగనుంది.. నేడు కాకినాడలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.. ఇక, కాకినాడ పర్యటన కోసం ఇవాళ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. నేరుగా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం సభలో.. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్..
Read Also: Raa Kadali Ra: నేటి నుంచి ‘రా కదలి రా!’
1వ తేదీ జనవరి, 2024 నుండి 66.34 లక్షల పెన్షన్లపై ఏటా రూ.23,556 కోట్లు ఖర్చుచేయనుంది ఏపీ ప్రభుత్వం.. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం లబ్ధి రూ. 83,526 కోట్ల పైగానే ఉంది.. గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతీ నెలా ఒకటో తేదీ ప్రొద్దున్నే తలుపు తట్టి లబ్దిదారుల గడప వద్దనే పెన్షన్లు అందజేస్తున్న విషయం విదితమే.. ఇక, పెన్షన్ పెంపు ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు లబ్ధి చేకూరనుంది. అసలు వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత పెన్షన్ ఎలా పెంచుతూ పోయారన్న వివరాల్లోకి వెళ్తే.. జులై 2019 నుంచి పెన్షన్‌ను రూ.2,250కు పెంచారు.. జనవరి 2022న రూ.2,500కు జనవరి 2023న రూ. 2,750కు.. ఇప్పుడు రూ.3వేలకు పెంచేశారు సీఎం వైఎస్ జన్. అయితే, త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మళ్లీ తాము అధికారంలోకి వస్తే.. పెన్షన్ పెంచనున్నట్టు సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.. మరోసారి అధికారం ఇస్తే.. ఈ సారి పెన్షన్ రూ.4వేలకు పెంచుతామని కాకినాడ వేదికగా జగన్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.