ఐపీఎస్ అధికారి, ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ కు మరోసారి షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అతడిపై సస్పెన్షన్‌ను మరోసారి పొడిగించింది.. మరో 6 నెలల పాటు సస్పెన్షన్ వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..
బ్యాంకర్ల తో ఏర్పాటు చేసే సమావేశాల్లో రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలన్నారు సీఎం చంద్రబాబు . రోటీన్ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 232వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది.. వ్యవసాయ, ప్రాథమిక రంగాలు, MSME, గ్రామీణ బ్యాంకింగ్ సేవలపై సమీక్ష నిర్వహించారు..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు మరోసారి షాకిచ్చింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో 12 మంది నిందితుల రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు.. ఈ కేసులో 12 మంది నిందితుల రిమాండ్‌ను సెప్టెంబర్ 3వ తేదీ వరకు పొడిగించింది న్యాయస్థానం .. రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో నిందితులను జైలుకు తరలిస్తున్నారు అధికారులు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి అభ్యర్థికి, ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లు పడతాయి... కానీ, ఒక్క ఏపీలోనే ఎన్డీఏ అభ్యర్థికి వన్ సైడ్ ఓట్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామకృష్ణ.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ కొత్త నిర్వచనం చెప్పి ఆయన.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని కించపరిచే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నారు..
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. మద్దికేర మండలం ఎం అగ్రహారంలో భర్తను దారుణంగా హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటేష్ అనే వ్యక్తిని భార్య సరస్వతి మూడు రోజుల క్రితం హత్య చేసింది.. ఆ తర్వాత ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచింది.. అక్కడి నుంచి పరారైంది..
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావం వల్ల మరో మూడు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం చోటు చేసుకుంది.. 18 నెలల బాలుడిపై పైశాచికత్వంగా కొట్టడమే కాకుండా మర్మంగాలపైన.. శరీర భాగాల పైన విచక్షణ రహితంగా కొరికి గాయాలు చేశాడు మరో మైనర్ బాలుడు... రోజువారి పనులు కోసం వెళ్తున్న సమయంలో పక్క ఇంట్లో 13 ఏళ్ల బాలుడిని నమ్మి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది..