నేను చంద్రబాబును కలిశానని.. పార్టీ మారుతానని కొందరు ఏడాది నుంచి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి .. ప్రతిసారి నేను క్లారిటీ ఇస్తున్నాను.. నేను పార్టీ మారే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు.. ఈ సారి కూడా వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీకి లేదా నెల్లూరు లోక్సభ కా అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.. ఇవాళ సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి పలు పరిశ్రమలకు వర్చువల్గా శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మొత్తంగా రాష్ట్రంలో రూ.4,178 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే పలు పరిశ్రమలకు భూమి పూజ ఈ రోజు నిర్వహించనున్నారు..
ఉమ్మడి రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ కొంత కాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది మా ఆలోచనగా పేర్కొన్నారు.. ఎన్నికల తర్వత ముఖ్యమంత్రి, పార్టీ నాయకత్వం దీనిపై చర్చించి ఆలోచిస్తారన్న ఆయన.. రాజధాని కట్టే అవకాశం ఉన్నా.. ఐదేళ్లు తాత్కాలిక పేరుతో టీడీపీ కాలయాపన చేసింది.. రాజధానికి కట్టే ఆర్థిక వనరులు లేక.. విశాఖ రాజధానిగా ఏర్పాటు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయన్నారు.