ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. ఆడుదాం - ఆంధ్రా ఫైనల్స్ లో గెలిచిన విజేతలకు ట్రోఫీ అందజేయనున్నారు.. దీని కోసం పీఎం పాలెం క్రికెట్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేసింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ).. సాయంత్రం 5.45 గంటలకు మధురవాడ హిల్ నెంబర్ 3 కి హెలిప్యాడ్ కు చేరుకోనున్న సీఎం.. 6 గంటలకు PM పాలెం స్టేడియంలో క్రికెట్ అభిమానులను కలుసుకుని, క్రీడాకారులను అభినందనలు తెలుపుతారు..
ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త చెబుతూ.. ఇప్పటికే ఏపీ డీఎస్సీ షెడ్యూల్ను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది.. మొత్తం 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు రిలీజ్ చేశారు.. మొత్తం 6,100 పోస్టుల్లో ఎస్జీటీలు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు.
ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలుచేశారు మంత్రి రాంబాబు.. ప్రస్తుతానికి ఏపీకి రాజధాని అమరావతే అని స్పష్టం చేసిన ఆయన.. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు.