వేలేరు గ్రామంలో పర్యటించిన యార్లగడ్డ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో పర్యటించిన ఆయన తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు చేయబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీల నేతలు విస్తృత పర్యటనలకు సిద్ధం అవుతున్నారు.. ఇక, ఈ సారి ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన పర్యటనల కోసం ప్రత్యేక హెలికాప్టర్ వాడనున్నారనే ప్రచారం సాగుతోంది.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తృత పర్యటనలకు జనసేనాని ప్లాన్ చేస్తున్నారట.
ఫేక్లే పార్టీ మారతారు.. నిజంగా వైఎస్ జగన్ను అభిమానించేవారు పార్టీ మారరు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్సీ అనిల్ కుమార్ యాదవ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను చనిపోయిన తర్వాత తన శవంపై పార్టీ జెండా జగన్ కప్పాలని బహిరంగంగా చెప్పిన నేత పార్టీ మారారు.. అందుకే ఎవరిని నమ్మాలన్నా భయం వేస్తుందన్నారు.. జగన్ బాగా నమ్మినవారిలో కొందరు ఆయననే మోసం చేశారని దుయ్యబట్టారు..
ఈ నెల 17వ తేదీన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సహా ఏపీ బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ఎన్నికల సన్నద్ధతపై రెండు రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ సదస్సులో పాల్గొననున్నారు పురంధేశ్వరి, బీజేపీ ముఖ్య నేతలు.. ఇక, బీజేపీ పెద్దలతో ప్రత్యేకంగా పురంధేశ్వరి సమావేశం కానున్నారు.. పొత్తులు.. సీట్ల సర్దుబాటుపై హైకమాండ్తో ఏపీ బీజేపీ చీఫ్ చర్చిస్తారని తెలుస్తోంది..