ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా, కేజ్రీవాల్‌ను అధికారులు ఘనంగా స్వాగతించారు.
AP Assembly : మూడవరోజు అసెంబ్లీ సమావేశాలు నేడు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాలు జరుగనున్నాయి. బి.సి. జనార్దన్ రెడ్డి – టేబుల్ ఐటెమ్ – 2020-21 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 16వ వార్షిక నివేదిక, కింజరాపు అచ్చెన్నాయుడు, టేబుల్ ఐటెమ్ – 2022-23 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క 46వ వార్షిక నివేదిక సమర్పించనున్నారు. Radhika Merchant: అంబానీ చిన్న కోడలి ఫన్నీ…
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు సోము వీర్రాజు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం లో ప్రజా పాలన సాగుతుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచి అమలు చేస్తున్నారన్నారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాజకీయ ఉత్కంఠత కొనసాగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ తలపెట్టిన శాంతియుత ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సెక్షన్ 30 పోలీస్ శాఖ యాక్ట్ అమలులోకి వచ్చింది. రాజకీయ ర్యాలీలు, ప్రదర్శనలపై ఆంక్షలు విధించారు పోలీసులు.
ఏపీ కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనున్నది. ముఖ్యంగా, 1982 ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోబడే అవకాశం ఉంది.
Call Money: తాజాగా ఏలూరులో కాల్ మనీ దందాలు సంబంధించి వరుసగా కేసులు వెలుగు చూస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరిగా బయటికి వస్తు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. తీసుకున్న డబ్బులకి పదింతలు చెల్లించినా మహిళలకు లైంగిక వేధింపులు ఆగడంలేదని ఆవేదన చెందుతున్నారు. ముఖయంగా అధిక వడ్డీలు చెల్లించలేకపోవడంతో, అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్ళిపోయే బాధితులు గతంలో కూడా పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని కొందరు బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Also Read: Road Accident: ఘోర…
ఆంధ్రప్రదేశ్‌లో 16 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్, ఐజీ పీఅండ్ ఎల్గా ఎం రవి ప్రకాశ్ బదిలీ అయ్యారు.
Current Bill : రెండు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ప్రకటించారు.
Spoon in Beer Bottle : ఈ మధ్యకాలంలో తినే ఆహారంలో తినాల్సిన వాటికంటే తినరాని వస్తువులు లేదా ఇతర జంతువులు ప్రత్యక్షమవుతున్నాయి. వీటికి సంబంధించి అధికారులు ఆయా విక్రయ దారులపై చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి సంఘటననే తాజాగా సీల్డ్ బీర్ బాటిల్ లో ఓ ప్లాస్టిక్ స్పూన్ ప్రత్యక్షమైంది. ఈ సంఘటన నంద్యాల జిల్లా డోన్ నగరంలో చోటుచేసుకుంది. డోన్ పట్టణంలోని బేతంచెర్ల సర్కిల్ వద్ద ఉన్న వైన్ షాపులో యువకుడు బీర్ సీసా…