కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పోలవరం కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషాద ఘటన ఆదివారం జరిగింది. బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
Robbery: గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ ఘటన కలకలం రేపింది. పట్టణంలోని డీ మార్ట్‌కు కుటుంబ సభ్యులతో వచ్చిన ముత్యాల లక్ష్మి (55) అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆమె చేతి బ్యాగ్‌ను లాక్కుని పరారయ్యారు. సరుకులు కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు, రాంగ్ రూట్లో వాహనంపై వచ్చి బ్యాగ్ అపహరించి అక్కడినుంచి పారిపోయారు. బ్యాగ్‌లో రూ. 30 వేల నగదు…
ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. వచ్చే నెల (ఫిబ్రవరి 6) న ఈ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో వచ్చే బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. త్వరలో ప్రారంభించే సంక్షేమ పథకాలపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది.
CM Revanth Reddy : తిరుపతి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని తెచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ఈ దుర్ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నర్సీపట్నానికి చెందిన బి.నాయుడు బాబు (51), విశాఖపట్నం జిల్లాకు చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన నిర్మల (50), తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిక (49) ఉన్నారు.…
Tragedy On Vacation: అన్నమయ్య జిల్లా శేషాచల అటవీ ప్రాంతంలోని గుంజేనేరు వాటర్ ఫాల్స్ వద్ద విహార యాత్ర విషాదాంతమైంది. బీటెక్ చదువుతున్న ఆరుగురు స్నేహితులు కలిసి గిరి, సాయి దత్త, మోహన్, కేదార్, మళ్లీ, దినేష్ కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఈ విహార యాత్రలో సాయి దత్తకి ఆకస్మికంగా తీవ్ర అస్వస్థత కలగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సాయిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నంలో యువకులు దారి తప్పిపోయారు. ఈ క్రమంలో వారు శ్రీకాళహస్తిలోని తమ స్నేహితులకు…
హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్‌ను నటుడు మోహన్‌బాబు పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులకు మోహన్‌బాబు క్షమాపణ చెప్పారు. తన వల్లే తప్పిదం జరిగిందని రంజిత్ తల్లి భార్య, పిల్లలను మోహన్ బాబు క్షమాపణలు కోరారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసునని.. నువ్వు తొందరగా రికవరీ కావాలి...ఉద్దేశపూర్వకంగా నిన్ను కొట్టలేదని రంజిత్‌తో మోహన్ బాబు అన్నారు.
కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా-KUDA) ఛైర్మన్ తుమ్మల బాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. పరిమితికి మించి అధికంగా స్టేజ్‌పైకి జనం చేరడంతో ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది.
ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళ గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి అవార్డు లభించింది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ అవార్డును అందుకుని ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు గ్రామపెద్దలు
ఉపమఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి ఓ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. మల్లిఖార్జున రావు పేరుతో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి ఈ కాల్స్ రాగా.. పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Pawan Kalyan : ఏపీ వ్యాప్తంగా శనివారం మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాయలసీమలో అత్యధికంగా గ్రంధాలయాలు ఉన్నాయి అందుకే నేను ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నానన్నారు. నన్ను పిఠాపురానికే పరిమితం చేస్తారని, కానీ నేను సరస్వతికి నిలయమైన రాయలసీమను ఎంచుకున్నానని ఆయన…