ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ.. అభివృద్ధి పథం వైపు సాగుదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ట్విటర్(ఎక్స్) ద్వారా అభినందనలు తెలియజేశారు.
ఏపీలో ఫలితాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. కూటమికి భారీ ఎత్తున సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం చతికల పడింది. దీంతో ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజీనామా చేశారు.
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే ఈవో ఎవి ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటైంది. సీఈసీ ఆదేశాలతో సిట్ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ విచారణ జరపనుంది. 13 మంది సభ్యులతో సిట్ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
AP PGESET-2024 కు గాను మార్చి 23న ప్రారంభమైన ఈ కార్యక్రమం దరఖాస్తుకు ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 20తో ముగిసింది. అయితే, మే 8 నుండి ఏపీ PGESET అప్లికేషన్ల కోసం మార్పు విండో తెరవబడింది. అభ్యర్థులు తమ దరఖాస్తును సవరించుకోవడానికి మే 14 వరకు గడువు ఉంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏపీ విశ్వవిద్యాలయాలలో ME, MTech, MPharmacy, PharmD అలాగే అనుబంధ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి PGESET నిర్వహిస్తుంది.…