Tragedy On Vacation: అన్నమయ్య జిల్లా శేషాచల అటవీ ప్రాంతంలోని గుంజేనేరు వాటర్ ఫాల్స్ వద్ద విహార యాత్ర విషాదాంతమైంది. బీటెక్ చదువుతున్న ఆరుగురు స్నేహితులు కలిసి గిరి, సాయి దత్త, మోహన్, కేదార్, మళ్లీ, దినేష్ కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఈ విహార యాత్రలో సాయి దత్తకి ఆకస్మికంగా తీవ్ర అస్వస్థత కలగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సాయిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నంలో యువకులు దారి తప్పిపోయారు. ఈ క్రమంలో వారు శ్రీకాళహస్తిలోని తమ స్నేహితులకు ఫోన్ చేసి, తాము దారి తప్పిన విషయాన్ని తెలియజేశారు.
Also Read: Akhil : అఖిల్ సినిమాలో ‘1992 స్కామ్’ విలన్
స్నేహితుల ద్వారా అందిన సమాచారం ఆధారంగా పోలీసులు వెంటనే శేషాచల అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. అనేక గంటల శ్రమ తర్వాత యువకులను గుంజన వాటర్ ఫాల్స్ సమీపంలో కనుగొన్నారు. కానీ, దురదృష్టవశాత్తూ సాయి దత్త అప్పటికే మరణించాడని నిర్ధారించారు అధికారులు. మిగిలిన ఐదు మంది యువకులను క్షేమంగా రక్షించి రైల్వే కోడూరుకు తరలించారు పోలీసులు. సాయి దత్త మృతదేహాన్ని కూడా రైల్వే కోడూరుకు తీసుకెళ్లారు. ఈ సంఘటనతో సంబంధిత కుటుంబాలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో పర్యాటకులు, ముఖ్యంగా యువత అటవీ ప్రాంతాలలో విహారయాత్రలకు వెళ్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: Flights Delayed: ఉత్తర భారతదేశాన్ని కప్పేసిన మంచు.. ఆలస్యంగా నడుస్తున్న 200 విమానాలు