Home
Andhra Pradesh News
Andhra Pradesh News News
-
Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
Amaravati: రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక సంస్థకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. అమరావతి రాజధానికి ఇలాంటి ప్రపంచస్థాయి సంస్థ రావడం గర్వకారణమన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోట్లాది కంటి చికిత్సలు అందించిన ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్.. అమరావతిలో మరింత విస్తృతంగా సేవలు అందించనుంది. 12 ఎకరాల విస్తీర్ణంలో.. ఏటా సుమారు 3… -
OTR: వివాదాస్పదంగా తంబళ్ళపల్లె టీడీపీ ఇన్చార్జి వైఖరి..
ఇంతే… నేనింతే…. ఎవరేం చెప్పినా నేనింతే…. మారే ప్రశ్నే లేదని ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెప్పేస్తున్నారా? ఒకసారి పక్కన పెట్టి మళ్ళీ పదవి ఇచ్చాక కూడా మార్పు లేకుండా పాత సినిమానే చూపిస్తున్నారా? ఆయన వైఖరితో విసిగిపోయిన కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా స్థానిక ఎన్నికల్లో మాదారి మేం చూసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నాయా? ఎక్కడుందా పరిస్థితి? నేను మోనార్క్‌ని అంటున్న ఆ నాయకుడెవరు? ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట.… -
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
CM Chandrababu: 40 ఏళ్లుగా తమ ఇళ్లపై పూర్తి హక్కుల కోసం ఎదురుచూస్తున్న వేలాది పేద, మధ్య తరగతి కుటుంబాల కల సాకారం కానుంది. విశాఖపట్నం వేదికగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్లుగా నివసిస్తున్న 28,445 కుటుంబాలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హక్కుదారు పట్టాలను పంపిణీ చేయనున్నారు. దీని విలువ రూ.8,874 కోట్లు. మొత్తం 399 ఎకరాల భూమిని క్రమబద్ధీకరిస్తూ 19,33,853 చదరపు గజాలను పేద కుటుంబాలకు… -
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
CM Chandrababu: విశాఖలోని పేదలకు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దశాబ్దాలుగా సొంత ఇంటిపై హక్కు కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాల కలను సాకారం చేసేందుకు రేపు విశాఖపట్నం వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు, హక్కు పత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు పూర్తి హక్కులు కల్పించేలా ఈ… -
Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
Minister Ramprasad Reddy: ఆంధ్రప్రదేశ్‌లో గణేష్ నిమజ్జనంలో డీజే వాహనాలకు అనుమతుల అంశంపై మంత్రి నారా లోకేష్ చేసిన విజ్ఞప్తిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. లోకేష్ ఎవరినీ ఆదేశించలేదని, కేవలం ప్రజలు, భక్తుల తరఫున విజ్ఞప్తి మాత్రమే చేశారని తెలిపారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తి భావంతో, ప్రశాంతంగా సాగాలన్నదే లోకేష్ ఉద్దేశమని పేర్కొన్నారు. నిమజ్జన యాత్రలో భక్తి సామరస్యానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని కోరడంలో తప్పేముందని రాంప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. ఒక మంత్రి… -
Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
Nara Lokesh: వినాయక చవితి రోజు ప్రతిష్టించిన బొజ్జ గణపయ్య విగ్రహాలను సంబరాలతో సాగనంపుతున్నారు భక్తులు.. అయితే, డీజే వాహనాలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడం.. వాహనాన్ని సీజ్ చేసిన ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాలకు అనుమతుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీకి విజ్ఞప్తి చేశారు మంత్రి నారా లోకేష్.. నిమజ్జనానికి డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం… -
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
Anakapalli Tragedy: అనకాపల్లి జిల్లాలోని బుచ్చయ్యపేట మండలం పెదమదిన గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన మైనర్ బాలిక, యువకుడు వేర్వేరు ఘటనల్లో ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరూ పక్కపక్క ఇళ్లలో నివసిస్తున్నట్లు సమాచారం. పెదమదిన గ్రామానికి చెందిన మజ్జి రేవతి (16) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. రేవతి కొమ్మాదిలో ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిసింది.… -
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
Nandyal District: నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గాలేరు నగరి కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. కాలువలో పారే నీటి ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు ఎనిమిదేళ్ల బాలుడు ఆరుష్ అదుపుతప్పి నీటిలో పడిపోగా, అతడిని కాపాడేందుకు తండ్రి అప్రోజ్ (36), అలాగే ఆయన బామ్మర్ది ఆషీక్ (32) తీవ్రంగా ప్రయత్నించారు. -
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
Vijayawada: విజయవాడలో ఆర్భాటపు జీవితం, అప్పుల ఊబిలో నుంచి బయటపడేందుకు బీటెక్ పూర్తి చేసిన 22 ఏళ్ల యువకుడు దొంగగా మారిన ఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడ వెటర్నరీ కాలనీలో భారీ చోరీకి పాల్పడిన నిందితుడు మరీదు వినోద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న దినేష్ కుమార్ కుటుంబం తన పాప వైద్య చికిత్స నిమిత్తం సెప్టెంబర్ 4న చెన్నైకి వెళ్లారు. -
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యం (డీఏ) ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. ఇప్పటివరకు అమల్లో ఉన్న డీఏ శాతాన్ని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను ప్రస్తుతమున్న 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఉద్యోగులకు అదనంగా 2.73 శాతం డీఏ పెంపు లభించినట్లయింది.…
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!