తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నవంబర్ 20న తిరుపతికి రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె 21న శ్రీవారి సేవలో పాల్గొననున్నారు.
రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న బస్సు ప్రమాదాలు, తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా విషాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Nara Bhuvaneshwari: లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. లండన్లోని మేఫెయిర్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IoD) మరియు ఐవోడీ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో భువనేశ్వరికి ఈ గౌరవాలు లభించాయి. Read Also: Plane Crashe: అమెరికాలో కూలిన కార్గో విమానం.. ముగ్గురు మృతి ప్రజా సేవా రంగం,…
CM Chandrababu: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ దగ్గర బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసింది.
Chevella: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాపూర్ దగ్గర చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో.. ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ ఢీ కొట్టడంతో 24 మంది మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Srikakulam: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని షాక్కు గురి చేసింది. భక్తుల రద్దీ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలవ్వగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలాన్ని మంత్రి నారా లోకేశ్ సందర్శించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు అసలు కారణాలు..
Botsa Satyanarayana: శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో తొక్కిసలాట జరగడం దురదృష్టకరం అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మరణించిన కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Kashibugga Stampede: మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వెళ్లి అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం తొక్కిసలాట ఘటన స్థలానికి వెళ్లారు. ఈసందర్భంగా ఆయన ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతూ.. కాశిబుగ్గలో వెంకటేశ్వర దేవస్థానం వద్ద జరిగిన ప్రమాదం అందరి మనసులను కలిచివేసిందని అన్నారు. ఈ సంఘటన చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. అమాయకులైన 9 మంది మహిళలు, 11 ఏళ్ల బాలుడు మృతి…