Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister TG Bharat: కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్య ఘటనపై మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో నిఘా వ్యవస్థ విఫలమైందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హత్యకు ముందే సోషల్ మీడియాలో ఇంతియాజ్ ఫొటో పెట్టి ‘RIP’ అని పోస్ట్ చేసినా పోలీసుల దృష్టికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మంత్రులపై నిఘా పెట్టే వ్యవస్థ నేరస్థులపై ఎందుకు నిఘా పెట్టడం లేదని నిలదీశారు. మంత్రులు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే విషయాలను నిఘా అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని, అలాంటప్పుడు నేరాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై సమాచారం పోలీసులకు ఎందుకు అందడం లేదని టీజీ భరత్ ప్రశ్నించారు. తనకు అందుతున్న సమాచారం కూడా పోలీసులకు అందడం లేదని, అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
ఇంతియాజ్ హత్యపై మంత్రి ఆగ్రహం
కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్‌ను పక్కా పథకం ప్రకారం దారుణంగా హత్య చేశారని టీజీ భరత్ ఆరోపించారు. ఇంతియాజ్ గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారని, ఆ సమయంలో నామినేషన్ ఉపసంహరించుకోవాలని వైసీపీ వర్గీయులు బెదిరించారని, ఆయన ఇంటికి వెళ్లి గొడవకు దిగారని పేర్కొన్నారు. తర్వాత ఇంతియాజ్ టీడీపీలో చేరారని మంత్రి తెలిపారు. హంద్రీ నదిలో జరుగుతున్న వైసీపీ కబ్జాలను ఇంతియాజ్ బయటపెట్టారని, వైసీపీ అక్రమాలను ప్రశ్నించినందుకే ఆయనను హత్య చేశారని టీజీ భరత్ ఆరోపించారు.
Also Read
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
- Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
వైసీపీపై తీవ్ర ఆరోపణలు
కర్నూలులో వైసీపీకి చెందిన రౌడీ మూకలు హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతూ అరాచకాలు సృష్టిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని విమర్శించారు. గత రెండేళ్లలో కర్నూలులో మూడు హత్యలు జరిగాయని, ప్రతి హత్యలోనూ వైసీపీ ప్రమేయం ఉందని తనకు సమాచారం ఉందని టీజీ భరత్ పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వైసీపీ నేతల స్పందన తెలియాల్సి ఉంది.
నిందితుడి వ్యాఖ్యలపై ఆందోళన
జైలు నుంచి బెయిల్‌పై బయటకు వస్తున్న సమయంలో ఒక నిందితుడు తిరిగి జైలుకు వస్తానని చెప్పి వెళ్లడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని టీజీ భరత్ అన్నారు. ఇలాంటి పరిణామాలను పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. కర్నూలులో పరిస్థితులపై జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి కోరారు. నేరస్థుల కదలికలు, వారి కార్యకలాపాలపై నిఘా మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
సీఎంకు పరిస్థితులు వివరిస్తా
కర్నూలులో నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని టీజీ భరత్ తెలిపారు. పోలీసులు ఇప్పటికైనా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. వైసీపీ ధోరణి ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు. కర్నూలులో మళ్లీ పాత తరహా ఫ్యాక్షన్ పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 1994 నుంచి 2004 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో కర్నూలులో ఫ్యాక్షనిజాన్ని అదుపులోకి తీసుకొచ్చామని టీజీ భరత్ గుర్తు చేశారు. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ అదే దిశగా వెళ్తే, వాటిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. కర్నూలులో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, నేరాలను ముందుగానే గుర్తించేలా నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు మంత్రి టీజీ భరత్..
తాజావార్తలు
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!