Deputy CM Pawan: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసింది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
Nimmala Ramanaidu : తుఫాన్ ‘మొంథా’ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వరదల ప్రమాదం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తతతో ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉపనదులకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, పరిస్థితిని సమీక్షించిన మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద సుమారు 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే, బుడమేరుపై…
AP Deputy CM Pawan: కృష్ణా జిల్లాలోని కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేలకొరిగిన వరి పంట పొలాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. స్థానిక రైతులతో కలిసి దెబ్బ తిన్న వరి పొలాలను పరిశీలించారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంథా తుఫాన్ తర్వాత పరిస్థితితో పాటు పంట నష్టంపై కాసేపట్లో ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
AP High Court: వైద్య కళాశాలలను పీపీపీ మోడల్ కి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. వైద్య కళాశాలను పీపీపీకి ఇవ్వటం ద్వారా థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో తీవ్రంగా నష్టపోయిన కృష్ణా జిల్లాల్లో ఈరోజు (అక్టోబర్ 30న) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు.
Viral Video: కర్నూలు బస్సు ప్రమాదం యావత్ తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్నటేకూరు వద్ద బస్సు బైకును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు బస్లో ఉన్న ప్రయాణికుల్లో 19 మంది మరణించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది.
Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాద ఘటన తీవ్ర విషాదం మిగిల్చింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 20 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ఇంధన ట్యాంకర్ను బైక్ ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమయ్యింది.
Bus Accident: కర్నూలులో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందినట్లు కలెక్టర్ సిరి తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఆమె పరిశీలించారు. "బైక్ బస్సు కిందకు వెళ్లడంతో.. డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయింది. 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారు. ఇప్పటివరకు 11 మృతదేహాలు వెలికితీశాం. ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకున్నాడు. 20 మంది క్షేమంగా బయటపడ్డారు." అని కలెక్టర్ సిరి తెలిపారు.