AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను నిరంతరాయంగా, సమర్థవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఐఆర్ బాధ్యతల్లో భాగస్వాములైన వివిధ శాఖల అధికారుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని అక్టోబర్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల నమోదు, జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు, సిబ్బంది స్థానచలనం లేకుండా ఒకే చోట విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హులైన కొత్త ఓటర్ల నమోదుతో పాటు బోగస్ ఓట్ల తొలగింపు, సవరణలపై యంత్రాంగం దృష్టి సారించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. వచ్చిన వినతులన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటిని సెప్టెంబర్ 28 నాటికి సంపూర్ణంగా పరిష్కరించనున్నారు. అనంతరం ఈ ప్రక్రియలన్నింటినీ ముగించి, అక్టోబర్ 3వ తేదీన ఎస్ఐఆర్ తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురించనున్నారు.
Also Read
- KTR: "రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా".. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
- Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
- Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
ముఖ్యంగా బూత్ స్థాయి అధికారులు (BLOలు), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (AEROలు), ఈఆర్వోలతో పాటు ఈ ప్రక్రియలో నేరుగా పాల్గొంటున్న కీలక ప్రభుత్వ అధికారులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. విధుల్లో ఉన్న అధికారులు మధ్యలో మారితే ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ పనుల వేగం మందగించే ప్రమాదం ఉందని భావించి ప్రభుత్వం ఈ బదిలీల నిషేధ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 3న తుది జాబితా ప్రచురణ పూర్తయ్యేంత వరకు ఎస్ఐఆర్ ఉద్యోగుల బదిలీలపై నిషేధం నిబంధన ఖచ్చితంగా అమల్లో ఉంటుంది.
తాజావార్తలు
-
Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
-
OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
-
KTR: “రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా”.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
-
IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’
-
Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?