Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Senior Tdp Leaders Troubles In Guntur District

Off The Record: పల్నాడు నేతలకు చెమటలు పడుతున్నాయా?

Published Date :January 6, 2023 , 10:11 pm
By NTV WebDesk
Off The Record: పల్నాడు నేతలకు చెమటలు పడుతున్నాయా?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఉమ్మడి గుంటూరు టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు సీనియర్లకు తలనొప్పి తెప్పిస్తున్నాయట. ఎన్నిక ఎన్నికకు ఎవరో ఒకర ఉరావడం ఫ్లెక్సీలు వేయడం…ఈ సారి సీటు నాదే…పోటీ నాదే అంటున్నారట. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు ఇలాంటి ఎఫెక్ట్‌ ఇంకోసారి పడిందట. ఈ వ్యవహారంపై ప్రత్యర్థి పార్టీలు …చర్యే అవసరం లేదు. కానీ దీని కథ, స్క్రీన్‌ ప్లే డైరెక్షన్ అంత టీడీపీ నేతలేనట.

Also Read

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
  • Off The Record : ఎన్టీఆర్ జిల్లాలో బలమైన కాపు నేతల కోసం వైసీపీ వెదుకులాట
  • Off The Record : టేకాఫ్ ఉంటుందా? లేదా పర్మినెంట్ ల్యాండిగేనా?
Add as a preferred
source on google

పల్నాడులో కీలక నాయకులకు చమటలు పట్టిస్తున్నారు చోటామోటా నాయకులు. రాబోయే ఎన్నికల్లో మేము సైతం రంగంలోకి దిగబోతున్నామంటూ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు పెద్ద నాయకులకు చికాకు పుట్టిస్తున్నాయట. అధిష్టానం కీలక నేతలతో ఒకటి రెండు ఫోటోలు దిగటం, ఆ ఫోటోలని తీసుకువచ్చి పెద్దపెద్ద ఫ్లెక్సీలు వేయించడం, రాబోయే ఎన్నికల్లో మేము సైతం ఎన్నికల బరిలో నిలవబోతున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా గురజాలలో… ఇటీవల కాలంలో టిడిపి నుంచి పోటీ చేస్తామని ఒకరిద్దరు చోటా నాయకులు రంగ ప్రవేశం చేశారు. ఇది టిడిపి ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి ఇబ్బందులు సృష్టిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి గురజాల నియోజకవర్గంలో టిడిపి నుండి యరపతినేని అభ్యర్థిగా ఉంటారనేది నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అలాంటి నాయకుడి ఇలాకాలో కూడా టిడిపి నుంచి వర్గ విధాలు పుట్టుకొస్తున్నాయి. దీనికి పరోక్షంగా జిల్లాలోని కొంతమంది నాయకులు సహకరిస్తున్నారనేది యరపతినేని వర్గీయుల వాదనట.

మరోవైపు అధిష్టానం ఇలాంటి వాటికి చెక్ పెట్టకపోవడంతో నియోజకవర్గంలో కొత్త కొత్త చర్చలు జరుగుతున్నాయట. నియోజకవర్గానికి చెందిన చల్లగుండ్ల శ్రీనివాసరావు…తాను గురజాల సీటు ఆశిస్తున్నానని…త్వరలోనే పోటీ చేస్తానని నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నాడట. అంతేకాదు…వెల్‌కమ్ చెబుతూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టేశారు. యరపతినేని ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఉండటంతో స్థానికంగా కలకలం రేపింది… ఇదేం అని అడిగితే తనకు యరపతినేనితో సంబంధం లేదని, అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారట. రాబోయే ఎన్నికల్లో గురజాలలో టిడిపి నుంచి పోటీ చేయబోతున్నానని సదరు డాక్టర్ సెలవు ఇచ్చారట. అయితే ఈ డాక్టర్ వెనక డెల్టా ప్రాంతానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నారట. గతంలో టిడిపి రాష్ట్ర కార్యాలయంలో ఉండే నాయకుడు ఒకరు గురజాల ప్రాంతంలో పోటీ చేస్తానని ఇలాగే తిరిగాడు. ఆ సమయంలో కూడా… పార్టీ కార్యాలయంలో ఉన్న కొందరు నేతలు…యరపతినేని టార్గెట్‌గా…అతన్ని రంగంలోకి దింపారట.

యరపతినేనికి వ్యతిరేకంగా వర్గాలు కడుతున్న నేతలు…నియోజకవర్గంలో చిన్న కమ్మ, పెద్దకమ్మ అంటూ టిడిపిలో చీలిక తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట. గతంలో కూడా యరపతినేనికి ఇదే అంశంలో కొందరు వ్యక్తులు గురజాలలో పోటీ దిగుతామని ప్రచారం చేసుకున్నారట. ఇప్పుడు తెరమీద కాదు కాదు ఫ్లెక్సీ మీదకు వచ్చిన డాక్టర్‌ శ్రీనివాసరావు కూడా చిన్న కమ్మ, పెద్ద పేరుతో పోటీ అంటున్నాడట. పలనాడు ప్రాంతం బలమైన నాయకుడిగా…అధిష్టానంతో సంబంధాలు ఉన్న సీనియర్‌ నేతగా ప్రచారం ఉన్న యరపతినేనికి…స్థానిక నాయకులతో వస్తున్న ప్రచారం చికాకు తెప్పిస్తోందట. యరపతినేని లాంటి నాయకుడికి సీటుపై క్లారిటీ లేకపోవడంతో…నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ పోటీకి రెడీ అవుతున్నామని కార్యకర్తల దగ్గర ప్రస్తావించడం, దీనిని అధిష్టానం సైతం ఖండించలేకపోవటం విశేషం.

యరపతినేనితో పడని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొందరు పార్టీ నేతలే దీని వెనుక ఉండి నడిపిస్తున్నారట. దీనికి అధిష్టానం కూడా ఇతోధికంగా సాయం చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. లేదంటే ఇలాంటి వార్తలు వచ్చిన వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకుంటే వ్యవహారం ముదిరేదికాదు. లేదంటే రాబోయే రోజుల్లో టిడిపిలో వర్గ విభేదాలు మరింత రాజుకొని పలనాడు ప్రాంతంలో చీలికలు తెచ్చినట్లుగానే డెల్టా ప్రాంతంలోని కొంతమంది నేతలను టార్గెట్ చేసే వ్యూహాలు రచించుకుంటున్నారట. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఈ ఇల్లు అంతే దూరం కదా అన్న కామెంట్లతో భవిష్యత్తులో టిడిపిలో పల్నాడు, డెల్టా ప్రాంతాల నాయకుల ఆధిపత్య పోరు కొనసాగే అవకాశం ఉందనేది జిల్లాలో జరుగుతున్న ప్రధాన చర్చ ….మరి చూడాలి ఈ గ్రూపు రాజకీయాలకి టిడిపి అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో ? ఎలా క్లారిటీ ఇస్తుందో! …

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhra politics
  • ap
  • chandrababu
  • off the record
  • Tdp Palnadu

తాజావార్తలు

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions