అండమాన్, నికోబార్ లోని 21 ద్వీపాలకు పరమవీర్ చక్ర అవార్డు గ్రహీతల పేర్లను పెట్టారు. అందులో ఒక ద్వీపానికి ఖేతర్పాల్ పేరు పెట్టడం పట్ల అల్లు శిరీష్ హర్షం వ్యక్తం చేశాడు.
ఎండలతో సతమతం అవుతున్న ప్రజానీకానికి ఐఎండీ చల్లని కబురు అందించింది. భారత్‌లోకి నైరుతి రుతుపవనాలు ఆగమనం చేశాయని ఐఎండీ తాజాగా వెల్లడించింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించినట్లు వివరించింది. అంతేకాకుండా బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడుకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు…