ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల డ్రస్సింగ్, బాడీ పార్ట్స్‌పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యల పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించగా. ఇందులో ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ తీవ్రంగా ఖండించడమే కాకుండా, అలా మాట్లాడటం తప్పని గట్టిగా వాదించారు. అయితే దీంతో సోషల్ మీడియాలో అనసూయకు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. శివాజీకి మద్దతుగా నిలుస్తున్న కొందరు నెటిజన్లు అనసూయనే టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు. ముందు మీరు వేసుకునే దుస్తుల…
నటుడు శివాజీ వర్సెస్ అనసూయగా మారిపోయిన వివాదం మీద మరోసారి అనసూయ స్పందించింది. నేను ఈ విషయం మీద మరోసారి క్లియర్ గా నా ఉద్దేశాలు చెప్పబోతున్నాను అంటూ ఆమె వరుసగా సోషల్ మీడియా పోస్టులు పెట్టింది. కొన్ని రాబందులు బాధ్యత లేని మీడియా హౌసులు గురించి ఆమె మాట్లాడుతూ తనపై జరుగుతున్న విష ప్రచారాన్ని “టెక్స్ట్‌బుక్ గ్యాస్‌లైటింగ్”గా ఆమె అభివర్ణించారు. బాధ్యతలేని కొన్ని మీడియా సంస్థలు, స్మార్ట్‌ఫోన్ చేతబట్టిన కొందరు వ్యక్తులు తన మాటలను కావాలనే…
ఈ మధ్యకాలంలో నటుడు శివాజీ, హీరోయిన్ల వస్త్రధారణ గురించి ఇచ్చిన సలహా ఎంత వైరల్ అయిందో, ఎంత వివాదానికి దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్రవంతి యాంకర్‌గా వ్యవహరించింది. ఆ రోజు ప్రపంచ చీరల దినోత్సవం కావడం, అదే రోజు ఆమె నిండుగా చీర కట్టుకుని రావడంతో శివాజీ ఆమెను ప్రశంసించే ప్రయత్నం చేస్తూనే హీరోయిన్లకు సలహా ఇచ్చారు. సలహా ఇవ్వడంలో భాగంగా సామాన్లు, “దరిద్రపుగొట్టు…” అంటూ…
టాలీవుడ్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపగా, ఆ వివాదం ఇప్పుడు నటి అనసూయ భరద్వాజ్ వర్సెస్ శివాజీగా మారిపోయింది. తన వయసును, వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శలపై అనసూయ సోషల్ మీడియా వేదికగా ఘాటు కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తి ఆలోచనా విధానం ఎలా ఉండాలో చెబుతూనే, తనను ‘ఆంటీ’ అని పిలుస్తూ ఏజ్ షేమింగ్ చేస్తున్న వారికి చురకలు అంటించారు. కొంతమంది పురుషులు, మహిళలు కూడా తన వయసును…
Anasuya Bharadwaj: మహిళల దుస్తులు, సంప్రదాయాలపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దండోరా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ.. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించడమే మంచిదని, రివీలింగ్ డ్రెస్‌లు సరికావని, ‘సామాన్లు ప్రదర్శించడం’ వంటి అభ్యంతరకర భాష ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ శివాజీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఫేస్‌బుక్‌లో…
నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణ పై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. రామ్ గోపాల్ వర్మ, మంచు లక్ష్మి వంటి వారు శివాజీని విమర్శించగా, నటి కరాటే కల్యాణి మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు. శివాజీ అన్నగా, తండ్రిగా ఆలోచించి మంచి ఉద్దేశంతోనే ఆ మాటలన్నారని ఆమె సమర్థించారు. సినిమా ఫంక్షన్లకు అర్ధనగ్నంగా రావడం వల్ల సమాజంలో సంస్కృతి దెబ్బతింటుందని, పిల్లలు వాటిని చూసి పాడయ్యే అవకాశం ఉందని కల్యాణి ఆందోళన వ్యక్తం…
“దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సుల మీద చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఈ అంశం మీద ఒక షాప్ ఓపెనింగ్‌కి హాజరైన అనసూయ స్పందించారు. డ్రెస్సులు అనేవి చాలా పర్సనల్, అది ఒక రకమైన ఫ్యాషన్. ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి. ఆయన ఎలా కనిపిస్తారో, ఆయన దృష్టిలో ఇన్‌సెక్యూరిటీ ఉన్నట్టు ఉంది. అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఎవరిష్టం వాళ్లది; ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం…
Anasuya : యాంకర్ అనసూయ ఇప్పుడు నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకుంది ఈ బ్యూటీ. నేను చిన్నప్పుడు దీపావళిని ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకునే దాన్ని. ఉదయాన్నే మంగళహారతి తర్వాత మా నాన్న ఇచ్చే పాకెట్ మనీ డబ్బుల కోసం నేను, మా సిస్టర్స్ వెయిట్ చేసేవాళ్లం. ఆ…
Anasuya : యాంకర్ అనసూయ అప్పుడప్పుడు చేసే కామెంట్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. ఆమె ఎలాంటి కామెంట్లు అయినా ఓపెన్ గానే చేసేస్తుంది. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. ఇప్పుడు నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. వస్తున్న అవకాశాలను గట్టిగానే వాడుకుంటోంది. అయితే రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేసింది. నేను పెళ్లికి ముందు ఒకే ఒక్క బాయ్ ఫ్రెండ్ ను మెయింటేన్ చేశా.…
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో డివైన్ ట్రెండ్ నడుస్తోంది. ‘కార్తికేయ 2’, ‘కాంతార’, ‘హనుమాన్’, ‘మిరాయ్’, ‘కాంతార చాప్టర్ 1’ వంటి చిత్రాలన్నీ కూడా మైథలాజికల్ టచ్‌తో కూడిన డివైన్ వైబ్స్‌ను అందించి, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ, ‘అరి’ అనే చిత్రం ఒక సరికొత్త మైథలాజికల్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘పేపర్ బాయ్’ దర్శకుడు జయశంకర్ ఈ చిత్రాన్ని షడ్వర్గాలు (అరి షడ్వర్గాలు) అనే అంశాన్ని…