Anasuya: టాలీవుడ్ ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు, తనపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులు, మార్ఫింగ్ ఫోటోలు అసభ్యకర ప్రచారానికి వ్యతిరేకంగా ఆమె చట్టపరమైన పోరాటానికి దిగారు. తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారంటూ అనసూయ ఏకంగా 42 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో సినీ నిర్మాతలు, జర్నలిస్టులు, టీవీ ఛానెళ్ల యాంకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉండటం గమనార్హం. తాజా సమాచారం ప్రకారం, సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వ్యవహారంలో మొత్తం 73 మందిపై కేసులు నమోదు చేశారు.
READ ALSO: Anil Ravipudi: అనిల్ రావిపూడికి మైండ్ బ్లాకయ్యే రెమ్యునరేషన్ ఆఫర్ .. రెవెన్యూ షేర్!
అనసూయ పేర్కొన్న ప్రకారం, కేవలం విమర్శలతో ఆగకుండా ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసేలా AI (Artificial Intelligence) ఉపయోగించి సృష్టించిన అసభ్యకరమైన వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలను వైరల్ చేశారు. లైంగిక, క్రిమినల్ బెదిరింపులతో సహా ఆమె జీవనోపాధిని, ప్రజా జీవితంలో భద్రతను దెబ్బతీసేలా ప్రవర్తించడం వంటి విషయాలను ఆమె కేసులో ప్రస్తావించారు. అనసూయ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని కఠినమైన సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. BNS సెక్షన్లు: 75, 79, 336(4), 351, 356, IT చట్టం: 66-E, 67 సెక్షన్ల కింద ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదైంది. ఈ వివాదంపై సింగర్ చిన్మయి శ్రీపాద ఎక్స్ (X) వేదికగా స్పందించారు. ఈ వేధింపులకు పాల్పడిన వారిలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారని ఆమె ఆరోపించారు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకురాలు బొజ్జ సంధ్యా రెడ్డి, పలువురు న్యూస్ యాంకర్లు అనసూయను కించపరిచేలా వ్యవహరించారని మండిపడ్డారు. మహిళా రక్షణపై చిత్తశుద్ధి ఉంటే సంధ్యా రెడ్డి లాంటి వారిని పార్టీలో ఉంచుకోవద్దని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు.
READ ALSO: Naga Vamsi: ఈగోను సాటిస్ఫై చేసిన సినిమా ఇది: నాగవంశీ