Anantapur Crime: అనంతపురం జిల్లాలో జరిగిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. కేసును చేదించిన అనంతరం జిల్లా ఎస్పీ జగదీష్ విలేకరులతో మాట్లాడారు. ఈ కేసులో నరేష్ అనే యువకుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. తన్మయి మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం నివేదిక ప్రకారం, తలకు తీవ్ర గాయాలు రావడం వల్లే ఆమె మరణించిందని తేలిందని వెల్లడించారు.
Read Also: Balakrishna : తిరుమలలో నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు హంగామా..
ఇక నిందితుడు విచారణలో తెలిపిన వివరాలను ఆయన తెలిపారు. నరేష్, బాధితురాలు తన్మయి గత మూడు నెలలుగా పరిచయంలో ఉన్నారని, ఒక నెల క్రితం వీరి మధ్య ప్రేమ మొదలైందని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుందామని చెప్పి తన్మయిని తీసుకెళ్లి, రాయితో కొట్టి హత్య చేశాడని ఎస్పీ తెలిపారు. ఇలాంటి దారుణ నేరాలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరగా న్యాయం జరగేలా చూస్తామని.. అలాగే, నిందితుల ప్రభుత్వ పథకాలను రద్దు చేసి, వారి ఆస్తులను కూడా అటాచ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.
Read Also: Devineni Avinash: రాష్ట్రంలో పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి.. దేవినేని అవినాష్ ఘాటు వ్యాఖ్యలు..!
ఇక కేసు దర్యాప్తులో.. ఎలాంటి రేప్ జరగలేదని, అలాగే పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు వచ్చిన వార్తలు నిరాధారమైనవని ఎస్పీ పేర్కొన్నారు. మొదట బాలు అనే వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదు వచ్చినా, దర్యాప్తులో నిజమైన నిందితుడు నరేష్ అని తేలిందన్నారు. ఈ కేసులో దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర నాథ్ యాదవ్‌ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.