Heartbreaking incident in AP: ప్రతీ వ్యక్తి జీవితంలో.. పెళ్లి, పిల్లలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. పిల్లలు పుట్టక ఆసుపత్రిలు, గుళ్లు, గోపురాలు, నాటు వైద్యులు చివరకు పూజారుల చుట్టూ తిరిగే తల్లిదండ్రులను చూస్తుంటాం.. ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు.. కానీ, న అనంతఓ తల్లి తన కన్న బిడ్డని పోషించలేక ఓ ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయిన హృదయ విదాకర ఘటపురంలో వెలుగు చూసింది.. ఆధునిక సమాజంలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోందని చెబుతున్నా.. కనీసం కన్నబిడ్డలను కూడా పోషించలేని స్థితిలో ఎంతో మంది ఉన్నారని చెప్పడానికి ఈ ఘటన అద్దం పడుతోందనే చెప్పాలి..
Read Also: PM Modi Amaravati Visit: ప్రధాని మోడీ పర్యటన.. అమరావతిని జల్లెడ పడుతున్న ఎస్పీజీ..!
అనంతపురంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అభం శుభం తెలియని రోజుల వ్యవధిలో ఉన్న చిన్నారిని గుర్తు తెలియని మహిళ రాత్రి సమయంలో విజయనగర్ కాలనీలోని ఓ ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయింది. చిన్నారి ఏడుపును గమనించిన స్థానికులు బయటకు వచ్చి చూడగా ముద్దులొలికే చిన్నారి నుదుటున బొట్టుతో కనిపించింది. చిన్నారి వద్ద ఓ లేఖ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. లేఖలో తన బిడ్డను నేను పోషించలేక వదిలి వెళ్లిపోతున్నానని.. ఈ బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్లు లేఖలో రాసింది. పోలీసులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.. శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఒకటో పట్టణ పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..