ఇప్పుడు చర్చ మొత్తం కృష్ణపట్నంలో ఆనందయ్య అందిస్తున్న కరోనా ఆయుర్వేద మందుపైనే.. కరోనా రోగుల నమ్మకం, విశ్వాసం ఎలా ఉన్నా ఇప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దీనిపై ఫోకస్ పెట్టాయి.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలుచేశారు ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆనందయ్య ఆయుర్వేద చికిత్సపై అధ్యయనం జరుగుతోందన్నారు.. కేంద్ర ఆయుష్ శాఖ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపామన్న ఆయన.. ఆయుష్ విభాగం అధ్యయనం చేయనుంది.. సోమవారం ఆయుష్ బృందం కృష్ణపట్నం వెళ్తుందని చెప్పారు. ఇక, ఇప్పటికే ఏపీ ఆయుష్ కమిషనర్ కృష్ణపట్నం వెళ్లిన విషయాన్ని వెల్లడించిన సింఘాల్.. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనంలో ఆనందయ్య ఆయుర్వేదం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదనే చెబుతున్నారని తెలిపారు.. హానికారకాలు ఉన్నట్టు తేలలేదని.. అయితే, శాస్త్రీయపరంగా మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీ ఏ విధంగా చేస్తున్నారనేది రేపు డిమానిస్ట్రేషన్ చేయబోతున్నారన్న ఆయన.. కృష్ణపట్నం గ్రామంలో ఆనందయ్య మందు వినియోగం.. కరోనా కేసుల నమోదుపై కూడా అధ్యయనం జరుగుతుందన్నారు.
మరోవైపు. ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు సింఘాల్.. ఆక్సిజన్ సరఫరా 600 మెట్రిక్ టన్నుల మేర సరఫరా చేస్తున్నామన్న ఆయన.. కాల్ సెంటరుకు వచ్చే కాల్స్ చాలా వరకు తగ్గాయన్నారు.. కరోనా చికిత్స మెరుగ్గా ఉండడం వల్ల కాల్స్ తక్కువగా వస్తున్నాయని భావిస్తున్నామన్న ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా 77 శాతం మంది కరోనా రోగులకు ఆరోగ్య శ్రీ ద్వారా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు వెల్లడించారు.. ఆక్సిజన్ సరఫరాను పెంచుకునేలా చర్యలు చేపట్టామని.. 52 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్న 9 పీఎస్ఏ ప్లాంట్లను పునరుద్దరించామని చెప్పుకొచ్చారు.. ఆక్సిజన్ ఉత్పత్తి కోసం పరిశ్రమల శాఖ పాలసీ తీసుకురానుందని.. ఆక్సిజన్ ఉత్పత్తి సంస్థలకు ప్రొత్సాహాకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.. ఇక, బ్లాక్ ఫంగస్ కేసులు ఇప్పటి వరకు 32 నమోదయ్యాయి.. బ్లాక్ ఫంగస్ చికిత్సలో కీలకమైన ఇంజెక్షన్లు 800 వయల్స్ ఏపీకి వచ్చాయని.. మొత్తంగా 16650 వయల్స్ కోసం ఆర్డర్ పెట్టామని.. డీఆర్డీఏ 2డీజీ మెడిసిన్ కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు అనిల్ కుమార్ సింఘాల్..