నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం లో ఆనందయ్య నాటు మందు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నాటు మందుతో కరోనా తగ్గిపోతుందని ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున ఆనందయ్య నాటు మందు కోసం కృష్ణపట్నం చేరుకున్నారు ప్రజలు. అయితే, తోపులాట జరగడంతో మందు పంపిణీని నిలిపివేశారు. ఈ మందుకు ఎంతవరకు శాస్త్రీయత ఉన్నది అని తెలుసుకోవడానికి ఆయుష్ శాఖ, ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు పరిశోధన చేయబోతున్నారు. ఇప్పటికే ఆయుష్ అధికారులు మందును పరిశీలించారు. ఐసీఎంఆర్ కూడా పరిశోధనలు చేయబోతున్నది. ఈ మందుకు శాస్త్రీయత ఉందని ఆయా శాఖలు దృవీకరిస్తే మందు పంపిణీకి అనుమతులు లభిస్తాయి. అయితే, ఈ మందుపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తనది ఆయుర్వేద మందు ఐ, ప్రజలకు మేలు చేసేందుకు తయారు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తామని అన్నారు. ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందని, తన మందును కొందరు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, తన మందును అమ్మే వారిని కట్టడిని చేయాలని ఆనందయ్య పేర్కొన్నారు.