కృష్ణపట్నంకు ఆయుష్ టీమ్.. అన్నింటిపై ఆరా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను అడ్డుపెట్టుకుని అందినకాడికి దండుకుంటున్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు, ఇక, ఫార్మా కంపెనీల దందా చెప్పాల్సిన పనేలేదు.. ఈ తరుణంలో.. ఉచితంగా కరోనావైరస్‌కు ఆయుర్వేద మందు పంపిణీ చేస్తూ వార్తల్లో నిలిచారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య.. పదులు, వందల్లో వచ్చేవారి సంఖ్య ఏకంగా వేలకు పెరిగిపోయింది.. దీంతో.. తాత్కాలికంగా మందు పంపిణీ నిలిపివేయాల్సిన పరిస్థితి. మరోవైపు.. ఆ మందులోని శాస్త్రీయతను తేల్చేపనిలోపడిపోయారు. ఆయుష్‌తో పాటు ఐసీఎంఆర్ కూడా రంగంలోకి దిగింది. కృష్ణపట్నంకు వెళ్లింది ఆయుష్ కమిషనర్ రాములు బృందం.. ఆనందయ్య తయారుచేసే వివిధ చెట్ల ఆకులు, పదార్థాలను పరిశీలించింది.. మందు తయారీ విధానాన్నికూడా అడిగి తెలుసుకున్నారు. ఆయుర్వేద మందులో ఏమేమి వస్తువులు కలుపుతున్నారు..? ఎలా? తయారు చేస్తున్నారు..? అనే విషయాలను దగ్గరుండి ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఇక, ఆయుర్వేద మందు వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా? లేదా? అనే విషయంపై ఐసీఎంఆర్ టీమ్ దృష్టి సారించింది.. ఆ మందు తీసుకున్నవారి దగ్గరికి వెళ్లి పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.. ఈ నివేదికలు రెండు, మూడు రోజుల్లో వస్తాయని చెబుతున్నారు. అయితే, ఆయుష్ టీం వచ్చినప్పుడు ఆనందయ్య అందుబాటులో లేరు.. ఆయన వచ్చిన తర్వాత మళ్లీ ఒకసారి వచ్చి పరిశీలన చేస్తామని చెప్పారు.. మొత్తంగా పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఒక నెగెటివ్ మార్కు కూడా లేనట్టుగా తెలుస్తోంది.. మరి నివేదికలు ఎలా వస్తాయి..? ఆయుర్వేద మందు పంపిణీ కొనసాగుతుందా? ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న వేలాది మందికి మందు అందుతుందా? వేచిచూడాలి.
Also Read
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..