మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేటి నుంచి జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఇక్కడ పౌరులే టార్గెట్ గా ఉగ్ర దాడులు జరుగుతున్న తరుణంలో పంచాయతీ సభ్యులు, రాజకీయ కార్యకర్తలతో సమావేశమవుతారు. అలాగే, కేంద్ర బలగాలతో సమావేశమై భద్రతపై సమీక్షిస్తారు.ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత షా తొలిసారి ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈ నెలలో ఇక్కడ జరిగిన దాడుల్లో 11 మంది పౌరులు మరణించారు. ఈ ఘటనలతో సంబంధం ఉన్న…
టీడీపీ అధినేత చంద్రబాబు ఇమేజ్ క్రమంగా మసకబారుతుందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తుచేసే బాబు గత కొంతకాలంగా రాజకీయంగా విఫలం అవుతున్నారు. ట్రెండ్ తగ్గట్టుగా చంద్రబాబు వ్యూహాలు ఉండకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కన్పిస్తోంది. 2020లోనూ పాతకాలం నాటి వ్యూహాలనే చంద్రబాబు నమ్ముకోవడంతో టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందనే టాక్ విన్పిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ఇమేజ్ ఏపీలోనే కాకుండా ఢిల్లీ స్థాయిలోనూ డ్యామేజ్ అవుతుండటం శోచనీయంగా మారింది. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నా…
ఏపీలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం భౌతిక దాడుల వరకు వెళ్లింది. దీంతో అధికార పార్టీపై ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. ఈ అంశంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏపీకి కేంద్ర బలగాలు పంపాలని చంద్రబాబు హోంశాఖ అధికారులకు లేఖ రాశారు. మరోవైపు వైసీపీ దాడులకు నిరసనగా…
ఏపీలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖలు రాశారు. టీడీపీ కార్యాలయంపై దాడులను ఖండిస్తూ ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిషా లకు లేఖలు రాశారు. ఈ దాడులపై విచారణ చేపట్టేందుకు సీబీఐ, ఎన్ఐఏలను రంగంలోకి దించాలని కోరారు. అంతేకాకుండా ఇలానే ఉంటే ఏపీ పరిస్థితులు మరింత దిగజారిపోతాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పోలీసులపై నమ్మకం పోయిందని, వెంటనే కేంద్ర బలగాలను రాష్ట్రంలో దించాలని…
హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం కనీవినీ ఎరుగని రీతిలో సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీగా క్యాంపెయిన్‌లో దూసుకుపోతున్నాయి. టీఆర్ఎస్ ప్రచార బాధ్యతలను మంత్రి హరీశ్‌రావు తీసుకున్నారు. ఆయన నేతృత్వంలో సీనియర్ నేత బి.వినోద్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు గెల్లు గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని చాలా రోజులుగా అధికార పార్టీ హుజూరాబాద్‌లో పావులు కదుపుతోంది. ముఖ్యంగా…
భారత్-పాక్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఆయుధాల తరలింపు, అక్రమ చొరబాట్లు, చివరకు డ్రోన్ల ద్వారా దాడులకు సైతం పూనుకుంటుంది పాకిస్థాన్.. అయితే, భారత సైన్యం ఎప్పటికప్పుడూ వాటిని తిప్పికొడుతూనే ఉంది. ఇక, తాజాగా ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో ఆరుగురు భారతీ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే కాగా.. పాకిస్థాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అతిక్రమణకు పాల్పడితే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని హెచ్చరించిన ఆయన.. దాడులను ఏమాత్రం సహించబోమని…
హుజురాబాద్‌కు ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తున్నది. హరీష్‌రావు అన్నీ తానై ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే కేసీఆర్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. అయితే, ఇటు బీజేపీ కూడా పోటీ పోటీగా ప్రచారం చేస్తున్నది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. ప్రస్తుతానికి లోకల్లో బీజేపీ నాయకులు ప్రచారం…
దేశంలో గత కొన్ని రోజులుగా విద్యుత్ సమస్యలపై వార్తలు వస్తున్నాయి. బొగ్గు కొరత తీవ్రంగా ఉందని, ఈ కోరత ఇంకోన్నాళ్లు ఇలానే కొనసాగితే విద్యుత్ సంక్షోభం తప్పదని రాష్ట్రాలు పేర్కొన్నాయి. దీనిపై ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి విద్యుత్, బొగ్గుశాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. దేశంలో బొగ్గు కొరత లేదని, తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలను…
దేశంలో బొగ్గు నిల్వలు అడుగంటిపోయాయి. కరోనా తరువాత అన్ని రంగాలు తిరిగి తెరుచుకోవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. డిమాండ్‌కు తగినతంగా విద్యుత్ ఉత్పత్తి జరగడంలేదు. గతంలో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అధికంగా ఉన్నాయి. అయితే కరోనా కాలంలో బొగ్గుతవ్వకాలు తగ్గిపోయాయి. దీంతో నిల్వలు తగ్గిపోవడంతో సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభంపై ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో అత్యవసర…
ప్రధాని నరేంద్ర మోడీ-కేంద్ర హోంశాఖ అమిత్‌షా ద్వయానికి గుజరాత్ రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వంలోనూ ప్రత్యేక స్థానం ఉంది.. ఆ ఇద్దరు కలిసి ఎన్నో విజయాలను అందుకున్నారు.. మోడీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా కలిపి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఓ టీవీ చానెల్‌తో ప్రత్యేంగా మాట్లాడిన అమిత్ షా.. ప్రధాని మోడీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను బటయపెట్టారు.. మోడీ నియంత కాదని, తనకు తెలిసిన అత్యంత ప్రజాస్వామిక నేతల్లో ఒకరని పేర్కొన్న ఆయన.. మోడీ…