బిగ్‌బాస్-5: రవి ఎలిమినేషన్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్‌బాస్-5 సీజన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. దీనికి కారణం యాంకర్ రవి ఎలిమినేషన్. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో నాటకీయ పరిణామాల మధ్య యాంకర్ రవి హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం బిగ్‌బాస్ షోపై వ్యతిరేకతకు దారితీస్తోంది. ఈరోజు ఉదయమే యాంకర్ రవి అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ఆందోళనకు దిగారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ అభిమానంతో తెలంగాణ వ్యక్తిని ఏ కారణం లేకుండా ఎలా ఎలిమినేట్ చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
Read Also: బిగ్‌బాస్-5: రవి ఎవిక్షన్ ఎఫెక్ట్… అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్తత
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఈ నేపథ్యంలో యాంకర్ రవి అభిమానులకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతుగా నిలిచారు. యాంకర్ రవిని ఎలిమినేట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. తెలంగాణలో బిగ్‌బాస్ షోను బ్యాన్ చేయాలని… అసలు ఆ షోలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని రాజాసింగ్ ఫైర్ అయ్యారు. యాంకర్ రవి ఎలిమినేట్ కావడంలో తెరవెనుక ఏదో జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
యాంకర్ రవి విషయంలో ఏం జరిగిందో బిగ్‌బాస్ నిర్వాహకులు వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ అభిమానంతో ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొడుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. చిన్నారులు, మహిళలు బిగ్‌బాస్ షోను చూడలేకపోతున్నారని… అన్ని భాషల్లో ఈ షోను బ్యాన్ చేయాలని కేంద్రమంత్రి అమిత్‌షాకు లేఖ రాస్తానని రాజాసింగ్ హెచ్చరించారు. హిందూ దేవుళ్లను సైతం బిగ్‌బాస్(హిందీ) షోలో అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తాజావార్తలు
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!