కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఇండో-పాక్ సరిహద్దుకు వెళ్లనున్నారు. ఒక రోజు రాత్రి అక్కడే గడపనున్నారు. డిసెంబర్ 4న రాజస్థాన్ లోని జైసల్మీర్‌లో అమిత్ షా పర్యటించనున్నారు. బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి అంతర్జాతీయ సరిహద్దు దగ్గర ఉండనున్నారు. అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో మాట్లాడనున్నారు. ఇదిలా ఉంటే సరిహద్దుల్లో గడిపిన మొదటి హోం మంత్రిగా అమిత్ షా నిలువనున్నారు.బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యనేతలు తరుచుగా ఆర్మీ, భద్రతా దళాల వద్దకు వెళుతున్నారు. దీపావళి సమయంలో కాశ్మీర్…
బిగ్‌బాస్-5 సీజన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. దీనికి కారణం యాంకర్ రవి ఎలిమినేషన్. ఆదివారం నాటి ఎపిసోడ్లో నాటకీయ పరిణామాల మధ్య యాంకర్ రవి హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం బిగ్‌బాస్ షోపై వ్యతిరేకతకు దారితీస్తోంది. ఈరోజు ఉదయమే యాంకర్ రవి అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ఆందోళనకు దిగారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ అభిమానంతో తెలంగాణ వ్యక్తిని ఏ కారణం లేకుండా ఎలా…
భారీవర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయింది. దీంతో తాము బాగా నష్టపోయామని, ఆదుకోవాలంటూ తక్షణసాయంగా రూ.వెయ్యికోట్లు ఇవ్వాలని ప్రధానికి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. తమను వెంటనే ఆదుకోవాలని కేంద్రాన్ని ఏపీ సీఎం జగన్ కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు వేర్వేరుగా లేఖలు రాశారు. భారీ వర్షాలు, వరదలతో…
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం అయ్యారు రాష్ట్ర బీజేపీ నేతలు.. అయితే, ఈ సమావేశంలో ఏపీ నేతలకు అమిత్‌షా పెద్ద క్లాసే తీసుకున్నారట.. ఏపీ కో-ఇంచార్జ్ సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్‌కి ప్రత్యేకంగా ఆయన క్లాస్ పీకినట్టు సమాచారం.. వైసీపీయే మన ప్రధాన శత్రువు… ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించిన ఆయన.. అమరావతే ఏపీ రాజధాని అన్నది బీజేపీ స్టాండ్.. రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలపాలని సూచించారు.. జనసేనా…
జోనల్ కౌన్సిల్ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులకు పలు సూచనలు చేసారు అమిత్ షా. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్రాలు వేగవంతం చేయాలి. ముఖ్యమంత్రులు స్వయంగా పర్యవేక్షించాలి అన్నారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ లో కేంద్రం సవరణలు చేయనుంది. రాష్ట్రాలు కూడా తమ సూచనలు, సలహాలు ఇవ్వాలి. డ్రగ్స్ రవాణా, వాడకాన్ని అరికట్టడానికి ముఖ్యమంత్రులు చొరవ చూపాలి. దేశంలో ఒక ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీల ఏర్పాటు చేసారు. రాష్ట్రాలు కూడా…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో తిరుపతి తాజ్‌మహల్ హోటల్లో జరిగిన దక్షిణాది రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్ అధ్యక్షత వహించారు. అంతేకాకుండా ఈ సమావేశానికి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, హోం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్ లతో పాటు ఇత రాష్ట్రాల మంత్రులు, అధికారులు హజరయ్యారు. ఆయా రాష్టాల సమస్యలు, విజ్ఞప్తులను అమిత్ షా విన్నారు. ఏపీకి సంబంధించి ఏడు కీలక అంశాలను జగన్…
తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలని, దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాల విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదన్నారు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయని, వీటితో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి…
సీఎం జగన్ అధ్యక్షతన తిరుపతిలో కాసెపట్లో సదరన్ జోనల్ కౌన్సిల్ ప్రారంభం కానుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ తిరుపతి చేరుకున్నారు. తిరుపతి చేరుకున్న జగన్‌కు మంత్రులు, నేతలు స్వాగతం పలికారు. అంతేకాకుండా ఈ సమావేశం కేంద్ర హోమంత్రి అమిషా నేతృత్వం జరుగనుంది. ఈ సమావేశంలో పలు పెండింగ్ అంశాల గురించి సీఏం జగన్ చర్చించనున్నారు. తెలంగాణ తరుపున హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్‌లు ఈ సమావేశానికి హజరవనున్నారు. ప్రారంభ ఉపన్యాసం…
తిరుపతిలో ఇవాళ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ 29వ సమావేశం జరగనుంది. సౌత్ స్టేట్స్ జోనల్ కౌన్సిల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చైర్మన్‌గా ఉండగా… ఏపీ ముఖ్యమంత్రి YS జగన్… వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. దీంతో ఈ సమావేశంలో ఏం చర్చిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ ఆతిథ్య నిర్వహణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఇవాళ తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ 29వ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌కు.. ఏపీ, తమిళనాడు,…
ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా ఏపీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. తిరుపతిలో వచ్చే నెల 14న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీవులకు చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల హోంమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇతర సీనియర్ అధికారులు…