కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. రేపు నిర్మల్ వస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అమిత్‌షా పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కమలనాధులు. వెయ్యి ఉరుల మర్రి సమీపంలో భారీబహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే సభాస్థలిని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకొని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. ఢిల్లీ నుంచి నాందేడ్ రానున్న ఆయన.. అక్కడ నుంచి నిర్మల్ వస్తారు.. వెయ్యి…
ఢిల్లీ పర్యటనలో ఉన్న త్రిదండి చిన్న జీయర్ స్వామి.. వరుసగా కేంద్రం పెద్దలను కలుస్తున్నారు.. బుధవారం రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి స్టాచ్యు ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా రావాలంటూ ఆహ్వానించిన ఆయన.. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.. శంషాబాద్ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన రామానుజ విగ్రహ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారు.. ఈ సందర్భంగా గంటకుపైగా అమిత్‌షాతో చర్చలు జరిపారు.. చిన్నజీయర్ తో పాటు…
మోదీ సర్కారుకు ప్రజా వ్యతిరేకత తెలిసి వస్తోందా? అంటే అంతా అవుననే సమాధానమే విన్పిస్తోంది. తాజాగా బీజేపీలో జరుగుతున్న నాటకీయ పరిణామాలే ఇందుకు నిదర్శంగా కన్పిస్తున్నాయి. ఇటీవల పలు రాష్ట్రాల్లోని సీఎంలను సైతం బీజేపీ హఠాత్తుగా మార్చేస్తుండటంతో ఆపార్టీకి సెగ భారీగానే తాకుతోందని అర్థమవుతోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని మోదీ-షాలు వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలోనే సీఎం మార్పు చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించేందుకు బీజేపీ ఆయా రాష్ట్రాల్లో వరుసబెట్టి నాయకత్వాన్ని మార్చివేస్తుందని రాజకీయ విశ్లేషకులు…
హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మూడు సార్లు వస్తారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. త్వరలోనే అమిత్ షా పర్యటనకు సంబందించిన షెడ్యూలు చెబుతామన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘హుజురాబాద్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా వేసే అవకాశం ఉంది.. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందని సీఎం ఢిల్లీ వెళ్లాడు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నాయి. నిర్మల్ అమిత్…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు.. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నిర్మల్‌కు వచ్చేయనున్నారు.. తెలంగాణ విమోచన సభను నిర్మల్ లో నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.. అయితే, 17వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడనుంది.. ఇప్పటికే సంజయ్ పాదయాత్ర 100 కిలోమీటర్ల మైలు రాయిని దాటేసింది.. అయితే, 17వ తేదీన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర…
ఢిల్లీ : కేంద్ర హోమంత్రి అమిత్ షాతో తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపటి క్రితమే భేటీ అయ్యారు. కేంద్ర హో మంత్రి అమిత్ షా నివాసంలో ఈ సమావేశం జరిగింది. విభజన చట్టం హామీల అమలు, ఐపీఎస్ అధికారుల సంఖ్య ని 195 కు పెంచాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కోరనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం కేంద్ర నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేయనున్నారు సీఎం కేసీఆర్. ఐపీఎస్ కేడర్ పోస్టుల కేటాయింపులు…
బీజేపీ నాయకులు.. తెలంగాణలో అందివచ్చిన వేవ్ ను కొనసాగించేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నట్టే కనిపిస్తోంది. దుబ్బాకలో గెలుపు ఇచ్చిన కిక్ తో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ లో అందిన అనూహ్య విజయం ఆ పార్టీలో మరింత జోష్ నింపింది. ఇది కొనసాగించడంతో పాటు.. రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ అడుగులకు బ్రేక్ వేయాలన్న లక్ష్యంతో.. బండి సంజయ్ విస్తృతంగా పాదయాత్ర చేస్తున్నారు. ఇదే క్రమంలో అధికార పార్టీపైనా విమర్శల దాడి చేస్తున్నారు. ఈ వేడిని మరింత…
ప్రజాగాయకుడు గద్దర్ ఇవాళ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సమావేశం అయ్యారు.. దేశవ్యాప్తంగా తనపై ఉన్న కేసుల గురించి కిషన్‌రెడ్డితో చర్చించిన ఆయన.. తనపై ఉన్న కేసులు అన్నీ ఎత్తివేయాలని కోరారు.. ఇక, ఈ కేసులపై చర్చించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్మెంట్ ఇప్పించాలని.. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని కోరారు గద్దర్.. కాగా, గతంలో తనపై ఉన్న కేసులను ఎత్తివేయడానికి, న్యాయసహాయం అందించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని గతంలో విజ్ఞప్తి చేశారు గద్దర్.. ప్రభుత్వం పిలుపు…
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు… ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన ఆయన.. ఆ తర్వాత హెలికాప్టర్లో శ్రీశైలం చేరుకున్నారు.. అక్కడ షాకు ఘనస్వాగతం లభించింది.. ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాని మోహన్, బీజేపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, అంబాల ప్రభాకర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.. ఇక, ఆ తర్వాత శ్రీశైలం…
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ ఏపీకి రానున్నారు. శ్రీశైలం ఆలయంలో షా పూజలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి తొలుత హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. 11.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి., అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.25కు కర్నూలు శ్రీశైలంలోని సున్నిపెంటకు అమిత్ షా చేరుకుంటారు. అనంతరం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అక్కడి…