వెయ్యి కోట్లు ఇవ్వండి..ప్రధాని మోడీ, అమిత్ షాకి జగన్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీవర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయింది. దీంతో తాము బాగా నష్టపోయామని, ఆదుకోవాలంటూ తక్షణసాయంగా రూ.వెయ్యికోట్లు ఇవ్వాలని ప్రధానికి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. తమను వెంటనే ఆదుకోవాలని కేంద్రాన్ని ఏపీ సీఎం జగన్ కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు వేర్వేరుగా లేఖలు రాశారు.
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రాష్ట్రానికి తక్షణమే రూ.వెయ్యికోట్ల సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోని కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో అసాధారణంగా 255 శాతం మేర అధిక వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది.
Also Read
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
తిరుపతి, తిరుమల, మదనపల్లె, నెల్లూరు, రాజంపేట తదితర ప్రాంతాలు నీట మునిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్ర నష్టం వాటిల్లింది. 196 మండలాల్లో నష్టం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. నాలుగు జిల్లాల్లో రహదారులు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. చాలా ప్రాంతాలు నీటమునిగాయి. తక్షణ సాయంగా రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలని తన లేఖల్లో సీఎం జగన్ కోరారు.
వ్యవసాయ రంగానికి జరిగిన నష్టం అంచనా రూ.1353 కోట్లు. వర్షాల వల్ల బ్రిడ్జిలు కూలిపోయాయి. ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,42, 862 ఎకరాల్లో పంట నష్టం కలిగింది. రహదారులు డ్యామేజ్ అవటం వల్ల జరిగిన నష్టం రూ.1756 కోట్లు. పట్టణాభివృద్ధి శాఖలో నష్ట అంచనా రూ.1252 కోట్లు. డ్యాములు, సాగునీటి శాఖకు జరిగిన నష్టం అంచనా రూ,556 కోట్లు. వర్షాల వల్ల మొత్తం నష్ట అంచనా రూ. 6,054 కోట్లు అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?