ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటింది భారతీయ జనతా పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం తొందరపడటం లేదు. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. గోవాలో ఒక్క సీటు తక్కువైనా.. మద్దతు ఇచ్చేందుకు స్వతంత్రులు, ఎంజీపీ రెడీగా ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి సమస్యలు లేకపోయినా.. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు మాత్రం.. చాలా కసరత్తే చేస్తున్నారు. గతంలో కేంద్ర కేబినెట్ కోసం ఎంత వర్కవుట్ చేశారో..…
BJP MP Bandi Sanjay Completed Two Years as Telangana BJP Chief Post. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆశీర్వచన సభ నిర్వహించారు. కాగా ఆయనను వేములవాడ రాజన్న ఆలయం నుంచి వచ్చిన పురోహితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉండి బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ…
ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్షా స్పందించాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్… పార్లమెంట్ సాక్షిగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకుంటే భావితరాలు క్షమించమని హెచ్చరించారు.. ఇక, ఏపీకి జరిగిన అన్యాయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడాలని సూచించిన ఉండవల్లి.. బీజేపీని నిలదీసేందుకు ఏపీని కలుపుకోవాలన్నారు.. ఎనిమిదేళ్ల క్రితం లోక్సభలో ఏపీ విభజన బిల్లు ఆమోదం జరిగినట్టు ప్రకటించారని తెలిపారన్న ఆయన.. రాష్ట్ర విభజనలో ఏపీకి జరిగిన అన్యాయంపై…
ముచ్చింతల్ లో జరుగుతున్న సమతామూర్తి శ్రీరామానుజ సాహస్రాబ్ది వేడుకల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2003 నుంచి చిన జీయర్ స్వామితో నాకు అనుబంధం ఉందని ఆయన తెలిపారు. గుజరాత్ లో భూకంపం వచ్చినప్పుడు చిన జీయర్ స్వామి అక్కడ సేవ కార్యక్రమలు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. సమాత మూర్తి విగ్రహ సమాత మూర్తి కేంద్రంను దేశం గుర్తు పెట్టుకుంటుంది.. అందరూ గుర్తు పెట్టుకుంటారని ఆయన అభిప్రాయం…
హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్లో శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ధి సమారోహం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు రథసప్తమి సందర్భంగా ఏడోరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దుష్టగ్రహ బాధల నివారణ కోసం యాగశాలలో శ్రీ నారసింహ ఇష్టి కార్యక్రమం నిర్వహించనున్నారు. అటు సర్వవిధ పాప నివారణ కోసం శ్రీమన్నారాయణ ఇష్టి, లక్ష్మీనారాయణ మహాక్రతువు, చతుర్వేద పారాయణం చేపట్టనున్నారు. ప్రవచన మండపంలో శ్రీనారసింహ అష్టోత్తర శతనామావళి పూజతో పాటు సామూహిక ఆదిత్య పారాయణం సహా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. Read Also: మార్చి…
ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత, గానకోకిల లతా మంగేష్కర్ అస్తమయం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె ఇక లేరన్న విషయాన్ని అభిమానులు, సెలబ్రిటీలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. తీవ్ర అనారోగ్యంతో ఆమె గత నెల రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లత ఉదయం మరణించారు. ఆమె ఆకస్మిక మరణానికి యావత్ దేశం నివాళులర్పిస్తోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, చిరంజీవి, నిర్మలా…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిన్న కరీంనగర్లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం జాగరణ దీక్ష చేపట్టారు. అయితే కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా బండి సంజయ్ దీక్ష చేస్తున్నారంటూ పోలీసులు బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను నిలిపేందుకు బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బండి సంజయ్ను అరెస్ట్ చేసి ఈ రోజు కరీంనగర్ కోర్టులో హజరుపరిచారు. దీంతో కోర్టు ఆయనకు 14…
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న వేళ అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించకుంటే మహమ్మారికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదని అన్నారు. తప్పని సరిగా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జనవరి 3 నుంచి 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసున్నవారికి వ్యాక్సిన్ అందిస్తున్నందువలన అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. Read: నయా రికార్డ్:…
యూపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రియాంక గాంధీతో ఎన్నికల ప్రచార ర్యాలీలు, సభలు నిర్వహిస్తుంది. ఈ సారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. తాజాగా యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్ మొత్తం అసెంబ్లీ స్థానాలు 403 కాగా,2022లో వచ్చే ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో 300లకు పైగా…
తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య పొలిటికల్ గేమ్ రసవత్తరంగా నడుస్తోంది. జనం దృష్టిలో వీరు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటారు. కానీ అవసరం ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకుంటారనేది బహిరంగం రహస్యం. బహుశా అందుకే కావచ్చు కాంగ్రెస్ పార్టీ తరచూ వీరిది మ్యాచ్ ఫిక్సింగ్ బంధమని ఎగతాళి చేస్తుంటుంది. రహస్య స్నేహితులని ఆరోపిస్తుంటుంది. ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు అంశంపై రెండు పార్టీలు చేస్తున్న హంగామా కూడా అలాంటిదేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఖరీఫ్…