కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో తిరుపతి తాజ్‌మహల్ హోటల్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్ అధ్యక్షత వహించారు. అంతేకాకుండా ఈ సమావేశానికి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, హోం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్ లతో పాటు ఇత రాష్ట్రాల మంత్రులు, అధికారులు హజరయ్యారు.
ఆయా రాష్టాల సమస్యలు, విజ్ఞప్తులను అమిత్ షా విన్నారు. ఏపీకి సంబంధించి ఏడు కీలక అంశాలను జగన్ సమావేశంలో ప్రస్తావించారు. జగన్ ప్రస్తావించిన అంశాలపై అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం హాజరైన అతిధులకు సీఎం జగన్ డిన్నర్ ఇవ్వనున్నారు.