తెలంగాణ రాజకీయాల్లో ఏ ఉప ఎన్నిక జరిగినా అధికార, విపక్ష పార్టీల మధ్య సంకుల సమరం జరుగుతుంది. పోరాటాల ఖిల్లా నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక కాకరేపుతోంది. మునుగోడు మండల కేంద్రంలో స్థానిక ఫంక్షన్ హాల్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న మునుగోడు మాజీ శాసనసభ్యులు కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. మునుగోడు మండలం లో వివిధ పార్టీ లకు చెందిన కార్యకర్తలు రాజగోపాల్ సమక్షంలో బీజేపీ పార్టీ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్బంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ పాలన అంతమొందించడానికి నా రాజీనామా,మునుగోడు ప్రజల అభివృద్ధి కోసమే నా పదవి త్యాగం అన్నారు.
కేసీఆర్ కుటుంబానికి మునుగోడు ప్రజల మధ్య పోరాటమని..ఇది పార్టీ ల మధ్య పోరు కాదని..మునుగోడు ప్రజల ఆత్మగౌరవ యుద్ధం అన్నారు రాజగోపాల్ రెడ్డి. చరిత్రలోనే నిలిచిపోయే తీర్పు మునుగోడు ప్రజలు ఇవ్వాలి..మునుగోడు కు అమిత్ షా వచ్చాడు..కండువా కప్పుకోవడానికి అందరూ ఢిల్లీ వెళ్తారు..వచ్చిన మరుసటి రోజు కవిత లిక్కర్ స్కామ్ బయటపడింది..ఆ తదుపరి కెటీఆర్ ,కేసీఆర్ స్కామ్ లో బయటపడేది..నా రాజీనామా తోనే రోడ్లు, పెన్షన్లు, అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు.
మునుగోడుకి ఎమ్మెల్యే గా ఉండి నేను ఏమి చేయలేకపోయాను..నా రాజీనామా తోనే ఫామ్ హౌస్ లో ఉన్న సీఎం మునుగోడు వచ్చాడు..నెల రోజుల నుండి ఏ టీవీ పెట్టిన మునుగోడు గురించే వినిపిస్తోంది. మునుగోడు లో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ప్రతి ఒక్కరూ రాజగోపాల్ లే అవుతారు..ప్రాణం పోయినా సరే మునుగోడు ప్రజలు తల దించుకునే పని చేయను..కేసీఆర్ పతనం మునుగోడు నుండే మొదలు కావాలన్నారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ లో కుటుంబపాలన పోవాలని టీఆర్ఎస్ నాయకులే చెబుతున్నారు.. మునుగోడు ప్రజల చేతిలో నేను ఒక ఆయుధాన్ని ..ఈ ఆయుధంతో కేసీఆర్ ని అంతమొందించాలన్నారు రాజగోపాల్ రెడ్డి. విజయం మనదే కానీ మెజార్టీ ఎంతో మీరు చెప్పాలి..టీఆర్ఎస్ పార్టీ కి డిపాజిట్ రావొద్దు..ఇక్కడ గెలిచేది రాజగోపాల్ రెడ్డి కాదు మునుగోడు ప్రజలే అన్నారు.
Read Also: PM Narendra Modi: అటల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోడీ