తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి.. అన్ని పార్టీల అగ్రనేతలు మునుగోడు బాట పడుతున్నారు.. తెలంగాణ సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇలా అగ్ర నేతలంతా మునుగోడు బాట పడుతున్నారు
ఆగస్టు 21న మునుగోడులో బీజేపీ బహిరంగ సభ జరగనుందని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ వెల్లడించారు. ఈ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరవుతారని తెలిపారు. కేసీఆర్ పాలనలో జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడుతారన్నారు.
టీమిండియాకు ఫాస్ట్ బౌలర్ షమీ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో బుమ్రాతో కలిసి జట్టుకు విజయాలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అయితే వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని విభేదాల కారణంగా షమీ తన భార్య హసీన్ జహాన్‌తో దూరంగా ఉంటున్నాడు. తాజాగా షమీ భార్య హసీన్ జహాన్ ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఓ ముఖ్యమైన విజ్ఞప్తిని చేసింది. కంగారు పడకండి… ఆమె ఇందులో షమీపై ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. కానీ తన విజ్ఞప్తి…
Bandi Sanjay: పోస్టర్లు వేయడం మేము మొదలుపెడితే టిఆర్ఎస్, కాంగ్రెస్ లు తట్టుకోలేవని బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. యాదాద్రి జిల్లా పొడిచెడు గ్రామం వద్ద ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసిన విషయంపై ఎన్టీవీతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎంతకు అమ్ముడుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన నేతలు ఎంత తీసుకున్నారని ప్రశ్నల…
21న రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారని స్పష్టం చేశారు బండి సంజయ్. మునుగోడు సభకు అమిత్ షా హాజరు అవుతారని, ఆయన సమక్షంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని తెలిపారు.