రాజ్యాంగంపై చర్చకు బీజేపీ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. లోక్‌సభలో జరిగే ఈ చర్చలో ప్రధాని మోదీ కూడా పాల్గొని సమాధానం ఇవ్వనున్నారు. డిసెంబర్ 13-14 తేదీల్లో లోక్‌సభలో, డిసెంబర్ 16-17 తేదీల్లో రాజ్యసభలో ఈ చర్చ జరగనుంది. రాజ్యాంగం పట్ల తమకున్న నిబద్ధతను ప్రదర్శించి ప్రతిపక్షాలపై దాడి చేయడమే బీజేపీ లక్ష్యం
మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం ప్రక్రియను స్టార్ట్ చేశారు. ఇక, ఏక్నాథ్ షిండే అక్కడున్న స్క్రిప్ట్‌ను చదవకుండా సొంతంగా ప్రసంగించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఫలితాలు కూడా వచ్చేశాయ్. మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఏర్పడలేదు.
మహారాష్ట్ర సీఎం పదవిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూల చర్చలు కొనసాగాయి.. ముంబైలో మరోసారి చర్చించిన అనంతరం దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తామని ఏక్ నాథ్ షిండే వెల్లడించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నాగాలాండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను సమీక్షిస్తున్నారు.
మణిపూర్‌లో హింస ఆగడం లేదు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా రెండో రోజు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన శాంతిభద్రతలను కాపాడాలని భద్రతా బలగాలు, రాష్ట్ర ఏజెన్సీలకు సూచించారు. రాష్ట్రంలో భద్రత కోసం 50 కంపెనీల అదనపు కేంద్ర పోలీసు బలగాలను షా పంపించారు.
ఆ ఇద్దరు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించారు.. కిషన్ రెడ్డి ఫైర్.. సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ వర్క్ షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 35 లక్షల సభ్యత్వం తెలంగాణలో పూర్తి అయిందన్నారు. ఈ నెల చివరి వరకు పోలింగ్ బూత్ కమిటీలు పూర్తి…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఎక్స్‌లో పోస్ట్‌లో సబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని ప్రశంసించారు. 2002 నాటి గోద్రా రైలు దహనం ఘటన ఆధారంగా తీసిన 'ది సబర్మతి రిపోర్ట్' సినిమా నిజాన్ని ధైర్యంగా బయటపెట్టిందని అన్నారు.
మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగడంతో రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పింది. శనివారం ముగ్గురు మహిళలతో సహా ఆరుగురి హత్య తర్వాత, ఆగ్రహించిన గుంపు బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల దాడి చేశారు. నిరవధిక కర్ఫ్యూ మధ్య, ఎన్పీపీ బీజేపీ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో దిగజారుతున్న పరిస్థితులను అదుపు చేయడంలో మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ విఫలమయ్యారని ఎన్పీపీ ఆరోపించింది.