Jagga Reddy: బీజేపీ వాళ్లు దేవుడిని మొక్కి పబ్లిసిటీ చేసుకుంటారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా కి రాహుల్ గాంధీ కి తేడా ఉందని తెలిపారు. రాహుల్ గాంధీ రోజు దేవుడిని మొక్కుతారు కానీ పబ్లిసిటీ చేసుకోరు కానీ.. బీజేపీ వాళ్లు దేవుణ్ణి మొక్కి పబ్లిసిటీ చేసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం అంటే దేశ ప్రజలకు ఒక ధైర్యం ఒక కవచం అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే మోడీ అయినా అమిత్ షా అయినా పదవులు అనుభవిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ కు రాజ్యాంగ నిర్మాణానికి ప్రోస్థహించింది.. ఇచ్చింది జవరహర్ లాల్ నెహ్రూ.. దాన్ని కాపాడడానికి అహర్నిశలు కృషి చేస్తున్నది నెహ్రూ ముని మనవడు రాహుల్ గాంధీ అన్నారు.
Read also: KTR Comment: సీఎం రేవంత్ ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
దేశ ప్రజలు ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్నారు అంటే అంబేద్కర్ రాజ్యాంగ ఫలితమే అన్నారు. అది మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. అందుకే రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణకు పోరాటం చేస్తున్నారు దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజకీయ కుట్ర చేసి రాహుల్ గాంధీనీ గత సంవస్తారం పార్లమెంట్ లో ఉండకుండా కుట్రలు చేశారని తెలిపారు. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీని పార్లమెంట్ కి రాకుండా దాడి చేసి అడ్డుకుంటున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. అయిన అంబేద్కర్ ని అవమానించిన అమీత్ షా క్షమాపణ చెప్పే వరకు రాహుల్ గాంధీ పోరాటం ఆపరని తెలిపారు. రాహుల్ గాంధీ ఏ పిలుపు నిచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంబేద్కర్ ను కేంద్ర మంత్రి అమిత్ షా ను అవమినిచిన విధానం పై రాహుల్ గాంధీ గళం విప్పారని తెలిపారు.
Read also: Minister Ponguleti: రౌడీయిజం సరికాదు.. కట్టడి చేయండి
పార్లమెంట్ నిండు సభలో అంబేద్కర్ ను అవమానించేల అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొనే వరకు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని అన్నారు. చట్టాలు, న్యాయాలు అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఉన్నాయని తెలిపారు. బీసీలుగా చెప్పుకొనే మోదీ అమిత్ షా కూడా అంబేద్కర్ రాజ్యాంగం వల్లే పదవులు పొందారన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు తీవ్రంగా కాంగ్రెస్ ఖండిస్తున్నామని తెలిపారు. దేశ ప్రజల భావాలు దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ బాధ్యత గాంధీ, నెహ్రూ అడుగుజాడల్లో నడవటం అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం వేరు భగవంతుడు వేరన్న విషయం అమిత్ షా గుర్తించాలని తెలిపారు. అమిత్ షా కి బీజేపీ, రాహుల్ గాంధీకి తేడా.. రాహుల్ గాంధీ దేవుని మొక్కుతాడు పబ్లిసిటీ చెయ్యరన్నారు. కానీ బీజేపీ దేవుడిని మొక్కేదే పబ్లిసిటీ చేస్తారన్నారు. దేవుడు అనేది నమ్మకం ధైర్యం.. భగవంతుడు అనేది వ్యక్తిగత విషయం అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పిలుపుకు సిద్ధంగా ఉంటారన్నారు.
Minister Ramprasad Reddy: భారతదేశంలో నంబర్ వన్‌గా ఏపీఎస్ఆర్టీసీని నిలబెడతాం!