డా.బీఆర్ అంబేడ్కర్‌ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ అని రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. రాజ్యాంగం, అంబేడ్కర్‌ను బీజేపీ ఎన్నడూ అగౌరపరచదన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తుందని బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అంబేడ్కర్ తమ నాయకుడని చెబుతున్న కాంగ్రెస్.. ఎందుకు భారత రత్న ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. వాజ్‌పేయీ హయాంలో అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చిన ఘనత తమ పార్టీది అని పురందరేశ్వరి పేర్కొన్నారు. అంబేడ్కర్‌పై కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను…
ఇదిలా ఉంటే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన డీఎంకే కార్గవర్గ సమావేశంలో 12 తీర్మానాలను ఆమోదించింది. పార్లమెంట్లో బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తొలి తీర్మానం చేశారు. ఈ తీర్మానంలో అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించారు. ‘‘ప్రజాస్వామ్య దేవాలయంలో దేశ హోంమంత్రి ఇంత అవమానకరంగా మాట్లాడటం సిగ్గుచేటు.
Ambedkar row: రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘‘అంబేద్కర్’’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే శనివారం అమిత్ షాపై పదునైన విమర్శలు చేశారు. ఆయనను ‘‘పిచ్చి కుక్క’’ కరిచిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అంబేద్కర్ వివాదం నడుస్తోంది. ఇటీవల రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఈ మధ్య కొందరికీ అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయిందని.. అంబేద్కర్ బదులు.. భగవంతుని పేరు తలుచుకుంటే స్వర్గంలోనైనా పుణ్యం దక్కుతుందని వ్యాఖ్యానించారు.
Jagga Reddy: బీజేపీ వాళ్లు దేవుడిని మొక్కి పబ్లిసిటీ చేసుకుంటారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా కి రాహుల్ గాంధీ కి తేడా ఉందని తెలిపారు.
Arvind Kejriwal: రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపింది. బాబాసాహెబ్ అంబేద్కర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్, డీఎంకే ఇతర ఇండియా కూటమి పార్టీలు ఆందోళన చేపట్టాయి. పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, తన వ్యాఖ్యల్ని ఎడిట్ చేసి, కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందిన నిన్న అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.
Congress: రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌తో పాటు ఇతన ప్రతిపక్షాలు బీజేపీపై విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అమిత్ షాని బర్తరఫ్ చేయాలని ప్రధాని మోడీకి అల్టిమేటం జారీ చేశారు. అయితే, తన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ తప్పుపట్టిస్తోందని అమిత్ షా వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Vijay On Amit shah: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు నిరసనలు, ఆందోళనలను నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ కేంద్రమంత్రి వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఈ విషయంపై తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇందులో భాగంగా నటుడు విజయ్ ప్రస్తావిస్తూ..…