Purandeswari: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. ఈ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు.. డిన్నర్ మీటింగ్ లో సీఎం, కేంద్ర హోంమంత్రి.. పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.. పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు.. ఇక రేపు రాత్రికి విజయవాడ నోవాటెల్ లో అమిత్ షా బస చేసి.. ఎల్లుండి గన్నవరం నియోజకవర్గం కొండపావులూరులో జరిగే NDRF 20వ వ్యవస్ధాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. అయితే, అమిత్‌షా ఏపీ పర్యటన.. సీఎం చంద్రబాబుపై భేటీపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి..
Read Also: Jeevan Reddy: రైతు భరోసా ప్రభుత్వం ప్రకటించినా.. బీఆర్‌ఎస్ రైతు ధర్నా అంటూ డ్రామా చేస్తోంది!
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎంను కలవడం ఆనవాయితీగానే వస్తోందన్నారు పురంధేశ్వరి.. ఇద్దరి మధ్యా పలు ముఖ్యమైన అంశాలు చర్చకు వస్తాయి.. రాజకీయ అంశాలు సైతం చర్చకు వచ్చే అవకాశం ఉంది… రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చర్చకు రావచ్చు.. అమిత్ షా, సీఎం కలయికలో వచ్చే అంశాలపై ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.. ఇక, వైజాగ్ స్టీల్‌ప్లాంట్ రాష్ట్ర ప్రజలకు సెంటిమెంట్.. వాజ్ పేయ్ కాలంలో స్టీల్ ప్లాంటుకు నిధులు విడుదల చేశాం.. ఇప్పుడూ విడుదల చేశామన్నారు.. స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ మేం కేంద్రం నుంచి కావాలని అడిగినదే న్నారు.. కేప్టివ్ మైన్స్ అనే అంశం కచ్చితంగా నిర్ణయిస్తారని తెలిపారు.. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్రం నిధులు ఇస్తోంది.. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం వల్ల ఇదంతా సాధ్యం అవుతుందన్నారు దగ్గుబాటి పురంధేశ్వరి..