Amit Shah: భారత సైన్యంపై ‘‘కుల’’ వ్యాఖ్యలు చేసినందకు రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. గురువారం బీహార్‌లోని మధుబని, పశ్చిమ చంపారన్, మోతిహరీ జిల్లాల్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన ఆయన, రాహుల్ గాంధీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీ పేరు మారబోతుందా? పేరు మార్చాలంటూ ఇటీవల భారీగా డిమాండ్ పెరిగింది. ఇప్పటికే వీహెచ్‌పీ డిమాండ్ చేయగా.. తాజాగా బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ డిమాండ్ చేశారు.
Amit Shah: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు వ్యాఖ్యల పదును పెరిగింది. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నిస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ అని స్పష్టం చేశారు.
ప్రధాని మోడీ-ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సారధ్యంలో అభివృద్ధిలో బీహార్ కొత్త శిఖరాలకు చేరిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారం ఉధృతం చేశారు.
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని నరేంద్రమోడీని ప్రశంసించారు. యూపీఏ ప్రభుత్వ సమయంలో పాకిస్తాన్ ప్రతీ రోజూ దాడులు చేసేదని, ఓటు బ్యాంకు కోల్పోతామనే భయంతో కాంగ్రెస్, ఆర్జేడీలు మౌనంగా ఉన్నాయని విమర్శించారు. బీహార్‌లోని ఖగారియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన షా, ఉరి, పుల్వామా, పహల్గామ్లలో జరిగిన ఉగ్రవాద దాడుల తర్వాత ప్రతీకారం తీర్చుకోవడం ద్వారా ప్రధాని మోదీ భారతదేశాన్ని సురక్షితంగా ఉంచారని…
Bihar Elections: బీహార్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి విడతలో 121 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
Gujarat cabinet: గుజరాత్ ప్రభుత్వంలోని మంత్రులంతా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగతా వారంతా పదవిని వీడారు. అయితే.. గుజరాత్ ప్రభుత్వం ఈరోజు ఉదయం 11:30 గంటలకు మంత్రి వర్గాన్ని విస్తరించనుంది. కొత్త మంత్రివర్గంలో 15 మంది కొత్త వ్యక్తులు సహా 25 మంది సభ్యులు ఉంటారని చెబుతున్నారు. తాజాగా రాజీనామా చేసిన మంత్రుల్లో కొందరు కొత్త లిస్ట్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా…
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, భారత్‌ను దాడులు ఆపేయాలని కోరకుంటే, అది వారికి ఘోరమైన విపత్తుగా మారేదని మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మంగళవారం అన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత, మే నెలలో భారత్ పాకిస్తాన్లో ఉగ్రస్థావరాలతో పాటు ఆ దేశ వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. నాలుగు రోజుల ఈ సైనిక ఘర్షణ తర్వాత, పాకిస్తాన్ బ్రతిమిలాడటంతో భారత్ సైనిక చర్యను నిలిపేసింది.
Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్ ఆదివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఓ ‘‘చొరబాటుదారుడు’’ అంటూ మండిపడ్డారు. ఆయన ఉత్తరాఖండ్ నుంచి, ఉత్తర్ ప్రదేశ్‌లోకి వచ్చాడని, ఆయన సొంత రాష్ట్రానికి తిరిగి పంపించాలని అన్నారు. రామ్ మనోహర్ లోహియా వర్ధంతి సందర్భంగా ఆదివారం లక్నోలోని లోహియా పార్క్‌లో విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ వద్ద నకిలీ లెక్కలు ఉన్నాయని, వాటిని నమ్మితే, తప్పిపోతారని అన్నారు.
Amit Shah: దేశంలో ముస్లిం జనాభాకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం కీలక ప్రకటన చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్ల కారణంగా దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందని షా అన్నారు. దేశంలో ముస్లిం జనాభా 24.6 శాతం పెరిగిందని, హిందూ జనాభా 4.5 శాతం తగ్గిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సంతానోత్పత్తి రేటు వల్ల ముస్లిం జనాభా పెరగలేదు. చొరబాటు వల్ల పెరిగిందని స్పష్టం చేశారు. దేశం మత ప్రాతిపదికన విభజించబడిందని..…