పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈడీ దాడులు రాజకీయ దుమారం రేపుతోంది. గురువారం అనూహ్యంగా కోల్‌కతాలో పలుచోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఐపీఏసీ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంపై అధికారులు దాడులు చేశారు. దీంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి సంఘటనాస్థలికి చేరుకున్నారు. మమత రాకతో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఇది కూడా చదవండి: IMD Warning: ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. చలిగాలులు.. ఐఎండీ వార్నింగ్
ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. హోంమంత్రి అమిత్ షాపై నిప్పులు చెరిగారు. ‘‘పార్టీకి సంబంధించిన హార్డ్ డిస్క్‌ను, అభ్యర్థుల జాబితాను సేకరించడమే ఈడీ, అమిత్ షా పనినా? దేశాన్ని రక్షించలేని ఈ నీచమైన, దుష్ట హోంమంత్రి నా పార్టీ పత్రాలను ఎలా తీసుకెళ్తాడు. నేను గనుక బీజేపీ కార్యాలయంపై దాడి చేస్తే ఫలితం ఎలా ఉంటుంది? ఒక వైపు పశ్చిమ బెంగాల్‌లో SIR నిర్వహించి ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారు. ఇప్పుడేమో నా పార్టీకి సంబంధించిన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.’’ అంటూ మమత ధ్వజమెత్తింది.

తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత వ్యూహం, అభ్యర్థుల జాబితాలు, గోప్యమైన డిజిటల్ మెటీరియల్‌ను ఈడీ దొంగిలించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అటువంటి సమాచారానికి ఎటువంటి ఆర్థిక దర్యాప్తుతో సంబంధం లేదన్నారు. మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు మమతా బెనర్జీ ఆకుపచ్చ ఫైల్‌ను పట్టుకుని కనిపించారు. దీంతో బీజేపీ విమర్శలుకు దిగింది. మమత ఏదో దాస్తున్నారంటూ తిప్పికొట్టారు. ఇక నకిలీ ఉద్యోగాల రాకెట్‌పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరిగాయని ఈడీ తెలిపింది.
#WATCH | Kolkata | West Bengal CM Mamata Banerjee says, "…Is it the duty of the ED, Amit Shah to collect the party's hard disk, candidate list?… The nasty, naughty Home Minister who cannot protect the country and is taking away all my party documents. What will be the result… https://t.co/idhFZnWuEj pic.twitter.com/rMjcef7Vhn
— ANI (@ANI) January 8, 2026