Burning Man Festival: అయ్యో పాపం.. పండుగకొచ్చి ఇరుక్కుపోయారో.. బురదలో 70 వేల మంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Burning Man Festival: అక్కడికి వచ్చిన వారందరూ పండగ కోసమని ఎంతో ఉత్సాహంగా అక్కడికి వచ్చారు. పండుగలో ఆనందంగా గడపాల్సిన వారు అనుకోని పరిస్థితుల కారణంగా అక్కడ చిక్కుకుపోవాల్సింది. ఇలా ఇరుక్కున్నది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 70 వేల మంది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇది జరిగింది నెవడాలోని బ్లాక్‌రాక్ ఎడారిలో.
అమెరికాలో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ చాలా ఫేమస్. చాలా మందికి దీనికి హాజరుకావడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వడాలోని బ్లాక్‌రాక్ ఎడారిలో ఆగస్టు 27న ఈ ఫెస్టివల్ మొదలైంది. దీనిలో పాల్గొనేందుకు 70 వేల మంది వరకు వచ్చారు. అయితే తర్వాతి రోజు రాత్రి అక్కడ అతి భారీ వర్షం కురిసింది. ఎంతలా కురిసిందంటే మూడు నెలల్లో కురవాల్సిన వాన మొత్తం ఒక్క రాత్రిలోనే కురిసింది. దీంతో పొడిగా ఉండాల్సిన ఎడారి తడిసి ముద్దయిపోయింది. అంతా బురదమయం అయిపోయింది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
Also Read: Boinapally Vinod Kumar: జమిలి ఎన్నికలు మంచిదే కానీ… చర్చ జరగాలని లా కమిషన్‌కు చెప్పాం
దీంతో అక్కడ జరగాల్సిన ఈవెంట్లు రద్దయ్యాయి. అంతేకాకుండా బురద కారణంగా ఎక్కడి వారు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. కాలు బయట పెట్టినా బురదలో కూరుకుపోయే పరిస్థితి ఉండటంతో ప్రభుత్వం అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించింది. బయట వారు లోపలికి రాకుండా బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ ను మూసేసింది. వాహనాలు బురదలో చిక్కుకొని కదలలేకుండా ఉన్నాయి. చుట్టూ కొన్ని మైళ్ల దూరం వరకు ఎటుచూసినా బురదే కనిపిస్తోంది. దీంతో ఆ ప్రాంతం ఎండే వరకు అక్కడే ఆహారం, నీరు తీసుకుంటూ పొడిగా ఉండే ప్రాంతాన్ని చూసుకొని విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పండుగ కోసం వెళ్లి ఇరుక్కుపోయే పాపం అంటూ ఈ వీడియో చూసిన వారు జాలి చూపిస్తున్నారు.
🚨#BREAKING: Burning Man Festival Declares National Emergency as over 73,000 Campers are trapped Urged to Shelter in Place Amid Flooding Crisis
Currently, more than 73,000 festival attendees and campers are trapped with no access in or out of the… pic.twitter.com/gMxoFiFKdm
— R A W S A L E R T S (@rawsalerts) September 2, 2023
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?