USA: మూడు దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల కన్వెన్షన్ ప్రకారం అమెరికా తన దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల నిల్వలను పూర్తిగా ధ్వంసం చేసిందని అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం ప్రకటించారు. అమెరికా తన చివరి రసాయన ఆయుధాలను సురక్షితంగా ధ్వంసం చేసినందుకు గర్వపడుతున్నానని.. రసాయన ఆయుధాలు భయం లేని ప్రపంచానికి మమ్మల్ని ఒక అడుగు దగ్గర చేసిందని బైడెన్ చెప్పారు.
Ram Gopal Varma says Jai Balayya: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రీసెంట్ గా 20 ఏళ్ళ తరువాత అమెరికా నాటా వేడుకకి వెళ్ళిన సంగతి తెలిసిందే. అమెరికా వెళ్లిన రాంగోపాల్ వర్మ ట్రిప్ ను చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లు అయితే కలకలం రేపుతున్నాయి. ముందుగా “నాటా నిర్వాహకులు నా అమెరికా ట్రిప్‌ను ఎంతో బాగా హ్యాపీ గా సాగేలా చేశారు, అమెరికా నాకెంతో ఇష్టం. అలాగే అమెరికాకు…
USA: అమెరికాలో మరోసారి జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన పునరావృతం అయింది. భర్త అరెస్టును రికార్డు చేస్తున్న ఓ నల్లజాతి మహిళపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు. ఆమెను నేలపైకి తోసి, మోకాలితో ఆమెను తొక్కేసి దాడి చేశారు. ఆమె కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టారు. ఈ ఘటన లాస్ ఏంజెలెస్ లోని లాంకాస్టర్ ప్రాంతంలో వింకో గ్రాసరీ స్టోర్ సమీపంలో జూన్ 24న ఈ ఘటన చోటు చేసుకుంది.
అమెరికాలో తుపాకీ సంస్కృతి మళ్లీ బుసలు కొట్టింది. స్వాతంత్య్ర దినోత్సవ రోజున కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రెండు రోజుల్లోనే 8మంది దాకా ఈ తుపాకీ సంస్కృతికి బలయ్యారు. మరో 28మంది దాకా గాయపడ్డారు.
భూమిపైనే అత్యంత వేడి రోజుగా జులై 3 రికార్డును నమోదు చేసింది. ఈ విషయాన్ని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ శాఖ తెలిపింది. జులై 3వ తేదీన భూఉపరితలానికి 2 మీటర్ల ఎత్తులోని గాలి సగటు ఉష్ణోగ్రత 62.62 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా 17.01 సెల్సియస్‌కు చేరుకుందని వెల్లడించింది.
11 మంది విద్యార్థినులను 'క్లాస్‌లో షర్టులు తీసేయమని' కోరినందుకు అమెరికాలోని కాలేజీ ప్రొఫెసర్‌పై వేటుపడింది. ఈ సంఘటన అక్టోబర్ 2019 లో జరిగింది. ఈ ఘటనలో విద్యాశాఖ పరిధిలోని పౌరహక్కుల కార్యాలయం విచారణ అనంతరం ఈ చర్య తీసుకుంది.
బ్రిటీష్ పాలనలో ఎన్నో ఏళ్లు అణిచివేతకు గురై తిరగబడటంతో ఎట్టకేలకు అమెరికా 1776 జులై 4న స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. అప్పటి నుంచి ఏటా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుతోంది.
ఈ మధ్య కాలంలో విమానాశ్రయాల్లో ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే విమానంలో సాంకేతిక లోపం రావడంతో అత్యవసరంగా ల్యాడింగ్ చేయాల్సి రావడం.. ఆ సమయంలో ప్రయాణీకులకు స్వల్ప గాయాలు కావడం సహజంగా జరుగుతున్నాయి
నీలి చిత్రాలు అందించే పోర్న్ హబ్ ఓ విచిత్ర విజ్ఞప్తి చేసింది. తమపై ఒత్తిడి తేవడానికి బదులు, పోర్న్ అంటే బోరింగ్ అనేలా.. నీలి చిత్రాలను సాధారణ విషయంగా మార్చడం గురించి ఆలోచించాలని ప్రభుత్వాలను కోరింది.
ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లో వేలాది మంది కొరియన్లు వీధుల్లోకి వచ్చారు. వారాంతంలో ప్రజలు అమెరికన్ వ్యతిరేక మార్చ్‌ను చేపట్టారు. యునైటెడ్ స్టేట్స్ను నాశనం చేసినందుకు "ప్రతీకార యుద్ధం" అని ప్రతిజ్ఞ చేస్తూ నిరసన నినాదాలు చేశారు.