ఉత్తర కొరియా సైనిక జనరల్ను ఆయన తొలగించారు. అంతేకాదు, యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందని, ఇందుకు రెడీ కావాలని సూచించినట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా తెలిపింది.
తూర్పు అమెరికా రాష్ట్రాలను తుఫాను వణికిస్తుంది. భీకర గాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికే ప్రమాద ఘటనల్లో ఇద్దరు మరణించారు. ఇప్పటికే వందల విమానాలను రద్దు చేశారు. వేలాది విమానాలు లేట్ గా నడుస్తున్నాయి. 11 లక్షలకు పైగా ఇళ్లు, వాణిజ్య కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
పదేళ్లకే ప్రాణాంతక వ్యాధిబారిన పడింది. ఆ చిన్నారిని రక్షించేందుకు ఆమె తల్లిదండ్రులు ఎంతగానో ప్రయత్నించారు. కానీ అప్పటికే పరిస్థితులు చేజారిపోయాయి. ఆమె జీవితంలో ఇక కొన్ని రోజులే మిగిలి ఉన్నాయని తెలుసుకున్న తల్లిదండ్రులు.. ఆ చిట్టి తల్లి కోరికను నెరవేర్చాలనుకున్నారు.
ఈమధ్య కాలంలో వాతావరణంలో పెను మార్పుల కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు ఇండియాలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి.
ఎవరి పిచ్చి వారికానందం. అటువంటిదే ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. అమెరికాకు చెందిన ఓ మహిళ అతి బిగ్గరగా త్రేన్పు రప్పించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది.
అమెరికాలో ఓ దారుణ సంఘటన జరిగింది. ఓ మహిళను పొడిచి చంపిన నిందితుడు.. ఆమె చనిపోయే చివరి క్షణాలను వీడియో తీశాడు. అంతేకాకుండా దానిని ఫేస్బుక్లో పోస్టు చేశాడు.
మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికాకు వెళ్లిన హైదరాబాద్ మహిళ సయ్యదా లులు మిన్హాజ్ జైదీ చికాగో రోడ్లపై మానసిక ఒత్తిడితో పోరాడుతూ, తన వస్తువులు చోరీకి గురై ఆకలితో అలమటిస్తున్నారు.
అమెరికా నేవీకి నూతన అధిపతిగా లీసా ఫ్రాంచెట్టి పేరు తెరపైకి వచ్చింది. దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆ పేరును ప్రతిపాదించారు. ఒకవేళ యూఎస్ సెనేట్ ఆ ప్రతిపాదనను సమర్ధిస్తే అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టి అమెరికా నావికా దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించనుంది.
Covid 19: కరోనా నాటి పరిస్థితులను ప్రపంచం మొత్తం అంత తొందరగా మర్చిపోదు. 2019 చివరి నెల అంటే డిసెంబర్ నుండి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కోవిడ్ వార్తలు రావడం ప్రారంభించాయి.