గాజాను స్వాధీనం చేసుకుని తీరుతామని మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. తాజా పరిణామాలపై జోర్దాన్ రాజు అబ్దుల్లాతో ట్రంప్ చర్చించారు. గాజాను కొనాల్సిన అవసరం లేదని.. దానిని స్వాధీనం చేసుకుని తీరుతామని ట్రంప్ వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులపై వేటు వేసే బాధ్యతను ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ చేతికి అప్పగించారు. రెండో దఫా పరిపాలనలో మస్క్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.
అమెరికా బాటలోనే యూకే ప్రభుత్వం వెళ్తోంది. అక్రమంగా ఉంటున్న భారతీయులకు బేడీలు వేసి మరీ అమెరికా తిరిగి పంపించేస్తోంది. తాజాగా అదే బాటలో బ్రిటన్ ప్రభుత్వం కూడా నడుస్తోంది.
ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో మోడీ పర్యటించనున్నారు. ఇక 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 11న ఫ్రాన్స్‌లో ఏఐ సమ్మిట్ జరగనుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గాజాపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ ఇటీవల చేసిన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి సంవత్సరం విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్తుంటారు. ఉన్నత చదువులు చదివి అక్కడే ఉద్యోం సంపాదించి డాలర్లు సంపాదించాలని కలలుకంటుంటారు. అయితే కొంతమంది విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకోకుండానే అసువులు బాస్తున్నారు. వివిధ కారణాలతో విద్యార్థులు మృత్యువాత పడుతున్నారు. దుండగుల కాల్పుల్లో కొందరు, రోడ్డు ప్రమాదాలు, వ్యక్తిగత కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ లో తెలుగు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుమ్మేటి సాయికుమార్ రెడ్డి ఉరేసుకొని ఆత్మహత్య…
ఓ అమెరికన్ మహిళ తన ప్రేమికుడిని వెతుక్కుంటూ పాకిస్థాన్ చేరుకుంది. ఆమె నెలల తరబడి పాకిస్థాన్‌లో ఉండింది. ప్రభుత్వం, ప్రేమికుడి నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసింది. ఈ ఘటనలో ప్రత్యేకత ఏమిటంటే ఆ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ ఆమె తన 19 సంవత్సరాల ప్రేమికుడి కోసం పాకిస్థాన్‌కు చేరుకుంది. పాక్ మీడియా నివేదికల ప్రకారం.. ఆ మహిళ పేరు ఒనిజా ఆండ్రూ రాబిన్సన్. ఆమె వయస్సు 33 సంవత్సరాలు. వీరిద్దరూ ఆన్లైన్లో…