రష్యా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ పుతిన్ మాట వినడం లేదు. యుద్ధం ఆపేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో ట్రంప్.. రష్యాపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రష్యాతో సంబంధాలు పెట్టుకునే దేశాలు జాగ్రత్త అంటూ హెచ్చరికలు ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి: Trump: భారత్ గురించి ఆ మాట విన్నాను.. అలా చేస్తే మంచిదే
ఇక తాజాగా రష్యా చేరువలోని సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గములు మోహరించాలని అమెరికా నౌకాదళానికి ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఈ చర్యను చేపట్టినట్లు ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ ప్రకటించారు. 10 రోజుల్లో ఉక్రెయిన్‌తో రష్యా శాంతి చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రష్యా కూడా ధీటుగా సమాధానం ఇస్తోంది. అమెరికాను ఎదుర్కొనేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నట్లు రష్యా చెబుతోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమ దగ్గర అమెరికా కంటే సామర్థ్యం గల అణు ఆయుధాలు ఉన్నాయని దిమిత్రీ మెద్వదేవ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Pregnant women : తల్లి అయ్యే ముందు తెలుసుకోవలసిన 5 ముఖ్యమైన విషయాలు !
అమెరికా అణు జలాంతర్గాములను ఎదుర్కోవడానికి రష్యా దగ్గర శక్తి అణు జలాంతర్గాములు ఉన్నాయని.. ఆ మాటకు వస్తే అమెరికా కంటే ఎక్కువగా తమ దగ్గరే ఎక్కువగా ఉన్నాయని రష్యన్ పార్లమెంట్ సభ్యుడు విక్టర్ వోడోలాట్స్కీ తెలిపారు.
ఇటీవల అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. రష్యా-అమెరికా ప్రత్యక్ష సైనిక ఘర్షణ జరగకూడదని భావిస్తున్నట్లు చెప్పారు. రూబియో వ్యాఖ్యలతో తాము కూడా ఏకీభవిస్తున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ పేర్కొన్నారు.
అయితే రెండు దేశాల మధ్య ఏదో జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాల నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను చూస్తుంటే.. యుద్ధ వాతావరణం కమ్ముకుంటున్నట్లు కనిపిస్తోంది. మాటలతోనే సరిపెడతారా? లేదంటే ప్రత్యక్ష యుద్ధానికి దిగుతారా? అన్నది వేచి చూడాలి.