భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. ఆగస్టు 27 నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి రానుంది. కొత్త టారిఫ్ కారణంగా పలు రంగాలు ఘోరంగా దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిగా వస్త్రాలు, ఆటో రంగం, సముద్ర ఫుడ్‌పై తీవ్ర ప్రభావం పడనుంది.
ఇది కూడా చదవండి: Sangeetha : మొత్తానికి విడాకుల ప్రచారంపై స్పందించిన.. హీరోయిన్
తాజాగా ట్రంప్ టారిఫ్‌పై కాంగ్రెస్ ఎంపీ శిశథరూర్ స్పందించారు. ట్రంప్ విధించిన సుంకాలకు భారత్ కూడా ప్రతీకారం తీర్చుకోవాలని సూచించారు. అమెరికాతో చర్చలు ఫలించకపోతే అమెరికా దిగుమతులపై కూడా 50 శాతం సుంకాలు విధించాలని.. అప్పుడే ట్రంప్ దిగొస్తారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Kollywood : మలేషియాలో స్టార్ హీరో సినిమా ఆడియో లాంచ్.. ఎప్పుడంటే
అయినా మనపై ట్రంప్ ఎందుకు అంత కోపంగా ఉన్నారో తెలియడం లేదన్నారు. చైనాకు 90 రోజులు గడువు ఇచ్చారని.. మనకు మాత్రం 21 రోజులు మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. మనం కూడా 50 శాతం సుంకం విధిస్తేనే దారిలోకి వస్తారని పేర్కొన్నారు. భారతదేశం ప్రస్తుతం అమెరికా దిగుమతులపై 17 శాతం సుంకాలను విధిస్తోందని.. దానిని 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. మీరు చేస్తే.. మేము చేస్తామన్న ధోరణిలో బెదిరించాలన్నారు. రష్యా దగ్గర చమురు తక్కువగా దొరుకుతుంది కాబట్టే భారత్ కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఏ దేశమైనా అదే పని చేస్తుందన్నారు. ఏ ప్రభుత్వమైనా అన్నదాతలకు నష్టం కలిగించే చర్యలకు పూనుకోకూడదని శశిథరూర్ సూచించారు.
భారత్‌పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే దీన్ని అన్యాయంగా విదేశాంగ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే అమెరికా బృందం ఈనెలలో భారత్‌లో పర్యటించనుంది. అప్పుడైనా అమెరికాలో మార్పు వస్తుందేమో చూడాలి.