అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఇంట్లోని వివిధ వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, వ్యక్తిగత కరస్పాండెన్స్‌తో కలిపి రహస్య పత్రాలను దాచిపెట్టారని ఎఫ్‌బీఐ తన అఫిడవిట్లో తెలిపింది.
అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసాకు చెందిన రోవర్ రెడ్ ప్లానెట్‌లోని జెజెరో క్రేటర్‌లో అద్భుతమైన మార్టిన్ శిలలను కనుగొంది. అవి నీటికి సంబంధించిన జాడలను కలిగి ఉండవచ్చని న్యూస్‌వీక్ నివేదిక తెలిపింది.
Racist attack on Indians in America: అమెరికాలో జాత్యహంకార దాడి జరిగింది. నలుగురు భారతీయ-అమెకన్లపై ఓ మహిళ జాతిపరంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెక్సాస్ రాష్ట్రంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు భారతీయ-అమెరికన్ మహిళలు మాట్లాడుతుండగా.. అక్కడికి వచ్చిన ఓ మహిళ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేసింది. భారత్ కు తిరిగి వెళ్లండి అంటూ దుర్భాషలాడింది.
తన రాజీనామాను డిమాండ్ చేస్తూ భారీ నిరసనల మధ్య జులైలో ద్వీపం దేశం శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన భార్య, కొడుకుతో కలిసి అమెరికాలో స్థిరపడాలని చూస్తున్నట్లు సమాచారం.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంట్లో ఎఫ్‌బీఐ దాడులు నిర్వహించింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో ఆయన నివాసంపై సోదాలు జరిపింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తన ఇంట్లోకి అధికారులు బలవంతంగా చొరబడ్డారని, ఇలాంటి దాడులు వెనకబడిన దేశాల్లోనే జరుగుతాయని ధ్వజమెత్తారు.
అమెరికాలో గన్‌కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. వరుస కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా డేటన్కు ఉత్తరాన ఉన్న ఒహియోలోని బట్లర్ టౌన్షిప్లో మరో సారి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు.
అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్‌కు సమీపంలో పిడుగుపాటుకు గురై ముగ్గురు మరణించారు. తమ 56వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వృద్ధ జంటతో సహా ముగ్గురు వ్యక్తులు శుక్రవారం వైట్‌హౌస్ సమీపంలోని పార్కులో పిడుగుపాటుకు గురై మరణించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.
ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. ఇంకా కరోనా సమస్య తొలగిపోకముందే ఈ వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో రోజురోజుకూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రపంచదేశాలను వణికిస్తున్న మంకీపాక్స్‌పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.
అమెరికా సెనెట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ను సందర్శించడం వల్ల చైనాతో యుద్ధానికి దారితీస్తుందని రష్యా అమెరికాను హెచ్చరించింది. అయితే పెలోసి ఇంకా ద్వీపాన్ని సందర్శించడానికి సిద్ధంగా ఉన్నారని పలు వర్గాలు వెల్లడించాయి.